విజయేంద్ర ప్రసాద్ విషయంలో ఎన్టీఆర్, చరణ్, మహేష్ సైలెంట్.. కారణమిదేనా?

విజయేంద్ర ప్రసాద్ విషయంలో ఎన్టీఆర్, చరణ్, మహేష్ సైలెంట్.. కారణమిదేనా?

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.జక్కన్న తండ్రి కథ అందిస్తే సినిమా సక్సెస్ సాధిస్తుందనే భావన చాలామందిలో ఉంది.

 Reasons Behind Ntr Charan Mahesh Not Responded About Vijayendra Prasad Details,-TeluguStop.com

విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా సక్సెస్ సాధించిన సినిమాలు అటు ఎన్టీఆర్ కెరీర్ లో ఇటు చరణ్ కెరీర్ లో ఉన్నాయి.కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయినా టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.అయితే చరణ్, ఎన్టీఆర్, మహేష్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ శుభాకాంక్షలు తెలపడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారనే విషయంలో చరణ్, ఎన్టీఆర్, మహేష్ లకు తెలియకుండా ఉండదు.

అయితే ఇప్పటివరకు వాళ్ల సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎలాంటి ట్వీట్లు రాలేదు.

Charan, Rajamouli, Ntr, Mahesh, Ram Chran-Movie

రాజమౌళి ఫ్యామిలీ విషయంలో ఈ హీరోలు అలిగారా? లేక సైలెంట్ గా ఉండటం వెనుక మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.మహేష్ బాబు తర్వాత సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే.మహేష్ అయినా ట్విట్టర్ లో స్పందించి ఉంటే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు.

Charan, Rajamouli, Ntr, Mahesh, Ram Chran-Movie

ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి అటు చరణ్, ఇటు ఎన్టీఆర్ లకు కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు.ఈ సినిమా ఏకంగా 1130 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube