ఆర్‌సీ15.. ఈ సస్పెన్స్ ఇంకా ఎన్ని రోజులు రాజు గారు?

ఆర్‌సీ15.. ఈ సస్పెన్స్ ఇంకా ఎన్ని రోజులు రాజు గారు?

రామ్ చరణ్ హీరోగా ఇటీవల వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్‌ సక్సెస్ ను దక్కించుకుంది.ఆ వెంటనే వచ్చిన ఆచార్య సినిమా నిరాశ పర్చింది.

 Ram Charan Shankar Movie Rc 15 Title Not Yet Clarity , Film News , Movie News-TeluguStop.com

ఇప్పుడు చరణ్ నటిస్తున్న శంకర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తున్న ఈ సినిమా ను ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంక్రాంతికి విడుదల చేసి తీరుతాం అన్నట్లుగా చెబుతున్నారు.ఇక ఈ సినిమా కు టైటిల్ గా అధికారి అనుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

అంతే కాకుండా సిటిజన్‌ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు.మొత్తానికి నాలుగు అయిదు టైటిల్స్ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అందులో విశ్వంభర టైటిల్‌ కూడా ఉంది.ఇన్ని టైటిల్స్ మద్యలో ఏ టైటిల్‌ ను రాజు గారు రిజిస్ట్రర్‌ చేయించారు అనేది క్లారిటీ రావడం లేదు.

అదుగో ఇదుగో అంటూ ఈ సినిమా టైటిల్ విషయంలో వస్తున్న పుకార్లు యూనిట్‌ సభ్యులకు గందరగోళంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో రోజుకో టైటిల్ అన్నట్లుగా ఆర్‌ సీ 15 కి ప్రచారం జరుగుతోంది.

శంకర్ సినిమా అంటే టైటిల్ చాలా స్పెషల్‌ గా ఉండేలా ప్లాన్ చేస్తాడు.అన్ని భాషల్లో కూడా ఒక్కటే టైటిల్‌ ఉండేలా ఆయన ప్లాన్‌ చేస్తాడు.అందుకే సిటీజన్ ఫైనల్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అధికారి బాగుంది అంటున్నారు.మొత్తానికి ఈ సస్పెన్స్ కు తెర పడేది ఎప్పుడు అంటే క్లారిటీ రావడం లేదు.

రామ్‌ చరణ్ కు జోడీగా ఈ సినిమా లో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే.అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌ ఇంకా పలువురు నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube