రాజమౌళి రాక్షస జాతికి చెందిన వ్యక్తి.. రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్!

రాజమౌళి రాక్షస జాతికి చెందిన వ్యక్తి.. రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలలో నటించారు.రాజమౌళిని దగ్గరగా చూసిన వ్యక్తులలో రాజీవ్ కనకాల కూడా ఒకరు.

 Rajeev Kanakala Shocking Comments About Rajamouli In An Interview Details, Junio-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల రాజమౌళి గురించి చెబుతూ జక్కన్న రాక్షస జాతికి చెందిన వ్యక్తి అని దేవతలను తయారు చేస్తూ ఉంటాడని అన్నారు.స్టూడెంట్ నంబర్ 1 సినిమా సమయంలోనే జక్కన్న విజన్ పెద్దదని రాజీవ్ కనకాల అన్నారు.

2002 సమయంలోనే తన తర్వాత సినిమాల సీన్లను రాజమౌళి సిద్ధం చేసుకున్నారని రాజీవ్ కనకాల తెలిపారు.24 గంటలు సినిమా సినిమా అంటూ రాజమౌళి ఆలోచిస్తారని అంత సినిమా పిచ్చోడిని నేను ఎప్పుడూ చూడలేదని రాజీవ్ కనకాల వెల్లడించారు.తనతో షూటింగ్ తర్వాత కూడా తీయబోయే సీన్, ఆ సీన్ కు తెరకెక్కించే విధానం గురించి జక్కన్న ఎక్కువగా చర్చించేవారని రాజీవ్ కనకాల వెల్లడించారు.

రాజమౌళి సీన్ వివరించే సమయంలో అవతలి వాళ్ల ఎక్స్ ప్రెషన్స్ ను గమనిస్తారని రాజీవ్ పేర్కొన్నారు.

Ntr, Rajamouli, Rajeev Kanakala, Rajeevkanakala, Tollywood-Movie

హీరోను అభిమాని ఏ విధంగా ప్రేమిస్తారో రాజమౌళి కూడా హీరోల విషయంలో అంతలా సీన్లు ఉండేలా చూసుకుంటారని రాజీవ్ అన్నారు.రాజమౌళి దగ్గర పట్టుకుందల్లా బంగారం అయ్యేలా టాలెంట్, పవర్ ఉందని రాజీవ్ అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు మనోబలం, పట్టుదల ఎక్కువని రాజీవ్ వెల్లడించారు.

Ntr, Rajamouli, Rajeev Kanakala, Rajeevkanakala, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్ ఏకసంతాగ్రహి అని కూచిపూడి బ్యాక్ డ్రాప్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారని వేళ్లతోనే ఎన్టీఆర్ అనుకుంటూ టేక్ అని చెప్పి సీన్లను పూర్తి చేస్తారని రాజీవ్ తెలిపారు.ఎప్పుడు నేర్చుకున్నాడో అర్థం కాని విధంగా ఎన్టీఆర్ ఉంటారని రాజీవ్ పేర్కొన్నారు.రాజమౌళికి, ఎన్టీఆర్ కు రాజీవ్ కనకాల సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube