టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం.ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తున్న నేపథ్యంలో తాజాగా ఏకంగా అంర్జాతీయ మీడియాలో సినిమా గురించి ప్రత్యేక కథనం రావడం చర్చనీయాంశంగా మారింది.ఈసారి లాస్ ఏంజిల్స్ టైమ్స్ లో ఈ సినిమా టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది.2022 సంవత్సరంలో విడుదల అయిన అత్యుత్తమ సినిమాల జాబితాను వారు తయారు చేశారు.అందుకు గాను అమెరికాలో విడుదల అయిన సినిమాలన్నింటిని కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు.టాప్ 20 జాబితాలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అవకాశం దక్కిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇండియన్ సినిమాల్లో మారె సినిమాకు ఈ గౌరవం దక్కలేదు.
ఆర్ ఆర్ ఆర్ ను అత్యంత గొప్ప సినిమా ల జాబితాలో సదరు అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొనడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.
ఎప్పటి నుండో సినిమా గురించి మీడియా లో వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇప్పుడు ఆ వార్తలు అంతర్జాతీయ రేంజ్ లో వస్తున్న నేపథ్యంలో జక్కన్న గురించి హాలీవుడ్ లో కూడా చర్చించుకుంటున్నారు.
హీరో లు ఇద్దరికి కూడా మంచి కితాబు దక్కింది.ఇటీవలే ఇజ్రాయిల్ మీడియాలో సినిమా గురించి మరియు ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.ఇప్పుడు అదే తరహా లో సినిమా గురించి లాస్ ఏంజిల్స్ టైమ్స్ లో ఆర్ ఆర్ ఆర్ కి చోటు దక్కడం జక్కన్న యొక్క గొప్ప పనితనంకు నిదర్శణం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ముందు ముందు మరిన్ని అరుదైన రికార్డులను.
రివార్డులను.అవార్డులను కూడా దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.