పాము అనే పేరు వింటేనే మనం వణికిపోతుంటాం కదా.ఎందుకంటే అది అంత ప్రమాదం మరి.
అదిమన చుట్టు పక్కలకు వచ్చినా సరే ఆమడ దూరం పారిపోతుంటాం.అలాంటిది పాముల్లోనే అతి పెద్దది అయిన కొండ చిలువ పేరు వింటేనే మనకు వణుకు పుడుతుంది.
ఎందుకంటే అతి దాని దగ్గరకు ఎవరు వెళ్లినా దాని కడుపులో వేసేసుకుంటుంది.ఎలాంటి జంతువును అయినా అది చుట్టేసి అమాంతం మింగేస్తుంది.
అది అంత ప్రమాదకరం కాబట్టే పెద్ద పెద్ద క్రూర జంతువులు కూడా దాని జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతుంటాయి.
ఇక ఈ మద్య కాలంలో ఇలాంటి కొండ చిలువలకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి.
కొందరు వాటిని ఏ మాత్రం భయం లేకుండా పట్టుకుంటున్నవి కూడా చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.దాన్ని చూస్తే మాత్రం వీళ్లు ఇంత డేరింగ్ గా ఉన్నారేంటి అని షాక్ అయిపోతారేమో.ఈ మధ్య కొండ చిలువలు ఇండ్లలోకి వస్తున్న ఘటనలు చాలానే చూస్తున్నాం.
ఇప్పుడు కూడా ఓ కొండ చిలువ ఓ ఇంటి ముందు ఉన్న కారులో దూరింది.
ఇంకేముంది కారు ఓనర్లు చూసి ఆశ్చర్యపోయారు.కారు టైర్ల నడుమ ఆ కొండ చిలువ ఇరుక్కుపోయిది.అయితే దాన్ని చూసి ఏ మాత్రం భయపడిపోకుండా ఆ తల్లి, కొడుకులు ఎంతో ధైర్యంగా దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
అయినా ఆ కొండ చిలువ మాత్రం రాకపోవడంతో బలవంతంగా దాన్ని బయటకు లాగేసి దాన్ని దూరంగా తీసుకెళ్లి వదిలారు.ఇక వీరు కొండ చిలువను బయటకు లాగే క్రమంలో తీసిన 29 సెకన్ల వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
పైగా దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.
.