పుష్ప ఎఫెక్ట్‌.. దేవి కోరుకున్న ఆ బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చిందట

పుష్ప ఎఫెక్ట్‌.. దేవి కోరుకున్న ఆ బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చిందట

అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.అక్కడ పాతిక కోట్లు వసూలు చేయడమే చాలా పెద్ద విషయం అనుకుంటూ ఉండగా ఏకంగా 90 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.

 Pushpa Music Director Devi Sri Prasad Get Bollywood Chance , Allu Arjun, Bollywo-TeluguStop.com

మరో వారం రోజుల్లో 100 కోట్లు లేకపోయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సినిమాలు విడుదల కావడం లేదు.అందుకే పుష్ప సినిమా కు భారీగా వసూళ్లు నమోదవుతున్నాయి.

ఇదే సమయం లో పుష్ప సినిమా యొక్క పాటలు హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి హిందీ అభిమానులు ఫీల్ అవుతున్నారు.

హిందీ లో పుష్ప సాంగ్స్ కి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దేవి శ్రీ ప్రసాద్ అని హిందీ కి ఆహ్వానించేందుకు పలువురు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

బాలీవుడ్లో సినిమాలు చేసేందుకు గాను దేవి శ్రీ ప్రసాద్ ఆసక్తి గా లేనట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఎందుకంటే బాలీవుడ్లో సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా పలువురు మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తారు.రెండు మూడు పాటలు కలిపి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు.

అలా నలుగురైదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఒక సినిమా కు వర్క్ చేస్తారు.అది నాకు నచ్చదు.

ఒక సినిమా కు వర్క్ చేస్తే మొత్తం నేనే చేయాలి.ఆ సినిమా లోని అన్ని పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేనే చేయాలి.

అలా చేస్తే నేను బాలీవుడ్ సినిమా కు వర్క్ చేస్తానంటూ దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకోవడం జరిగింది.ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ బాలీవుడ్ నుంచి ఆయనకు ఒక ఆఫర్ వచ్చినట్లు సమాచారం అందుతోంది.

ఒక స్టార్ హీరో సినిమా కు గాను దేవిశ్రీప్రసాద్ సింగిల్ కార్డు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించేందుకు ఆఫర్ని దక్కించుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి.ఈ విషయం లో అతి త్వరలో నే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube