పూరీ ఫైటర్ తర్వాత కేజీఎఫ్ స్టార్ తోనే పాన్ ఇండియా మూవీ  

Puri Jagannadh to team up with KGF actor Yash, Tollywood, South Cinema, Sandalwood, KGF Movie, Rocking Star Yash, - Telugu @purijagan, Kgf Actor Yash, Kgf Movie, Puri Jagannadh, Rocking Star Yash, Sandalwood, South Cinema, Tollywood

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

TeluguStop.com - Puri Jagannadh To Team Up With Kgf Actor Yash

ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.విజయ్ దేవరకొండని మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్ లో ఈ సినిమాలో పూరి చూపించబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడి మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.సింగిల్ షెడ్యూల్ తో సినిమాని పూర్తి చేసే పనిలో పూరి జగన్నాథ్ ఉన్నాడు.

TeluguStop.com - పూరీ ఫైటర్ తర్వాత కేజీఎఫ్ స్టార్ తోనే పాన్ ఇండియా మూవీ-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఫైటర్ తర్వాత పూరి జగన్నాథ్ నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలే వస్తాయని గతంలో ఛార్మి చెప్పుకొచ్చింది.ఈ నేపధ్యంలో పూరి జగన్నాథ్ నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి అప్పడే చర్చ మొదలైంది.

హీరో రామ్ తో డబల్ ఇస్మార్ట్ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.అయితే అది ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే పూరి నెక్స్ట్ సినిమాని మరో పాన్ ఇండియా స్టార్, కేజీఎఫ్ హీరో యష్ తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ప్రస్తుతం యష్ కేజీఎఫ్ సీక్వెల్ పనిలో ఉన్నాడు.

ఈ సినిమా అయిపోయిన తర్వాత అతను కూడా అన్ని పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేసుకుంటున్నాడు.అలాగే సౌత్ లో ఇతర ఇండస్ట్రీలలో ఉన్న దర్శకులు కథలు కూడా ఎక్కువగా వింటున్నాడు.

ఈ నేపధ్యంలో రీసెంట్ గా పూరి జగన్నాథ్ యష్ ని కలిసి కథ చెప్పడం జరిగిందని, కథ నచ్చడంతో అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్ నడుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబందించిన కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

రాకింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యష్ లాంటి పవర్ ఫుల్ మాస్ హీరోతో పూరి సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ అంచనాలకి వదిలేయడమే.అయితే పూరి యధావిధిగా తనకి అలవాటైన మాఫియాని యష్ కోసం ఎంచుకుంటాడా లేదా కొత్త కథ ట్రై చేస్తాడా అనేది చూడాలి.

#KGF Actor Yash #Puri Jagannadh #@purijagan #Sandalwood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube