ఆవు పేడను కారుకి పులిమిన యజమాని, ఎందుకో తెలిస్తే మీరు కూడా అలాగే చేస్తారు!

ఆవు పేడను కారుకి పులిమిన యజమాని, ఎందుకో తెలిస్తే మీరు కూడా అలాగే చేస్తారు!

ఆశ్చర్యపోకండి, మీరు విన్నది నిజమే.అతడు తన కారునిండా ఆవు పేడను పులుముకున్నాడు.

 Pune Man Covered Its Omni Car With Cow Dung Details, Cow Dung,viral Latest, News-TeluguStop.com

అయితే దీనివెనుక ఓ అదిరిపోయే కారణం ఉందండోయ్.బేసిగ్గా మన కారుపైన చిన్న గీతపడితే ప్రాణం విలవిల్లాడుతుంది.

అలాంటిది బురదలో కారు ఇరుక్కుపోయినట్టు మన కారు నిండా ఎవరన్నా పేడను రాస్తే, ఇంకేమైనా వుందా? వెతికి మరీ వారిని పట్టుకొని చితక్కొడతాం.అలాంటిది ఆ కారు యజమానే స్వయంగా తన కారు మొత్తాన్ని పేడతో అలికేశాడు.

ఛీ, పేడ కంపు కొడుతుందని అని అంటారా? అయితే అదే తన కారుకి ఇంపు అని అంటున్నాడు ఆ ఓనర్.

వివరాల్లోకి వెళితే, పూణెకు చెందిన ఓ వ్యక్తికి సూపర్ ఐడియా వచ్చింది.

ఈ మండు వేసవిలో ఎండలు ఏ స్థాయిలో మండుతున్నాయో అందరికీ తెలిసినదే.ఇక పుణేలో అయితే వేరే చెప్పనవసరం లేదు.

అక్కడి ఉష్ణోగ్రతలకు మనుషులు బొగ్గుల్లాగా మాడిపోతున్నారు.అలాంటి సమయంలో AC లేని కారులో ప్రయాణించడమేంటే.

కుక్కర్లో కూర్చొని ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది మరి.ఈస్థితిలో ఓ ‘మారుతీ ఓమిని’ కారు యజమాని ఎండ తాకిడికి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాడు.చివరికి.అతడికి ఓ కత్తిలాంటి ఐడియా వచ్చింది.

ఆలోచన వచ్చిన వెంటనే షురూ చేసాడు.ఆవు పేడ చల్లదనం ఇస్తుందని తెలియడంతో ఆ కారు యజమాని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓ 2 గంపల పేడ తెచ్చి కారుకు పులిమేశాడు.

కేవలం లైట్లు, విండ్‌షీల్డ్స్ తప్పించి కారు మొత్తాన్ని ఇలా ఫొటోలో చూపించినట్టు పేడతో ముంచేశాడు.ఆ తర్వాత జాలీగా ఆ ‘పేడ’ కలిగిన కారులో చక్కర్లు కొట్టాడు.

కాగా ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.మీ కారు కూడా చల్లదనం కావాలనుకుంటే ఈ పనిచేసి చూడండి మరి!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube