పబ్ లో ఎంజాయ్ చేస్తున్న పునర్నవి భూపాలం.. డ్యాన్స్ చేస్తున్నా వీడియో వైరల్!

పబ్ లో ఎంజాయ్ చేస్తున్న పునర్నవి భూపాలం.. డ్యాన్స్ చేస్తున్నా వీడియో వైరల్!

పునర్ణవి భూపాలం. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరు అనే చెప్పాలి.

 Punarnavi Bhupalam Enjoy Pub Video Viral Details,  Punarnavi, Viral Video, Pub,-TeluguStop.com

తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి 2013లో ఉయ్యాల జంపాల సినిమా తో పరిచయమైంది.అందులో హీరోయిన్ స్నేహితురాలుగా నటించింది.

ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ, సైకిల్ వంటి పలు సినిమాలలో నటించింది.

కానీ అంతగా పేరు సంపాదించుకోలేక పోయింది.

ఇక ఈ బ్యూటీ బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ఇందులో తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం పునర్నవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఏకంగా ప్రేమాయణం నడిపింది.

హౌస్ లో ఉన్నంత కాలం వీరిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు.

అంతే కాదండోయ్ వీరి మధ్య క్లోజ్ చూస్తే ఆ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు.అలా హౌస్ లో చివరి వరకు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉన్నారు.

కానీ హౌస్ నుంచి బయటికి వచ్చాక మాత్రం వీరిద్దరిని ఒకటిగా మళ్లీ చూడలేదనే చెప్పాలి.

దాంతో వీరిద్దరూ బ్రేకప్ అయ్యారని వార్తలు కూడా వచ్చాయి.వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరూ విడిపోయారని తెలిసింది.ఆ తర్వాత పునర్నవి అప్పుడప్పుడు బుల్లితెరపై పలు షోలలో కనిపించింది.

ఇక వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది.కానీ ఎందుకో అంత సక్సెస్ కాలేకపోయింది.

ఇక సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన ఫాలోవర్స్ తో బాగా షేర్ చేసుకుంటుంది.

అంతేకాకుండా నేచర్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది.ఇక తాను చేసే వర్క్ అవుట్ వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

నిజానికి ఆమె చేసే వర్కౌట్లు చూస్తే ఫిదా కావాల్సిందే.ఇక అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా చిల్ చేస్తోంది.తన పిల్లితో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఇక ఈమె ప్రస్తుతం ఫారన్ లో ఉండగా అక్కడ సంబంధించిన విషయాలను కూడా బాగా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో పంచుకుంది.

అందులో తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.

అందులో తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా చిల్ అవుతుంది.అంతేకాకుండా అందులో డాన్స్ చేస్తూ బాగా ఆకట్టుకుంది.

అందులో తన పిల్లి కూడా కనిపించింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు, తన ఫాలోవర్స్ తెగ లైక్స్, కామెంట్లు ఇస్తున్నారు.ఇక కొందరు అక్కడ స్టడీస్ కోసం వెళ్ళావా అని ప్రశ్నలు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube