ఇండో యూఎస్ మధ్య బంధాన్ని మోడీ దృఢపరుస్తున్నారు : అమెరికాలో భారత రాయబారి తరంజిత్

ఇండో యూఎస్ మధ్య బంధాన్ని మోడీ దృఢపరుస్తున్నారు : అమెరికాలో భారత రాయబారి తరంజిత్

భారత్ అమెరికాల మధ్య సంబంధాల సామర్ధ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అర్ధం చేసుకుని.రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ.

 Pm Modi Understands Potential Of India-us Relationship: Ambassador Sandhu, Pm Mo-TeluguStop.com

గతేడాది ఇరుదేశాల మధ్య 160 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరగడాన్ని ఆయన ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.ఆదివారం చికాగోలోని ఎన్ఐడీ ఫౌండేషన్ నిర్వహించిన విశ్వ సద్బావన కార్యక్రమంలో సంధూ మాట్లాడుతూ.1.4 బిలియన్ల మంది పౌరులకు అధినేతగా ప్రధాని మోడీ మనలో ప్రతి ఒక్కరినీ పెద్ద కలలు కనేలా ప్రోత్సహించారని అన్నారు.దృఢ సంకల్పం, పట్టుదలతో కొనసాగితే ఈ కలలను సాధించవచ్చని ఆయన ముందుకు సాగారని అన్నారు.

మనమంతా పెద్ద కలలు కంటూనే ఆ కలల సాధనకు ఉద్రేకంతో పనిచేద్దామని తరంజిత్ పిలుపునిచ్చారు.

మోడీ తన సంకల్పం, దూరదృష్టితో అమెరికాతో బంధాన్ని నెలకొల్పారని సంధూ అన్నారు.ఈ క్రమంలోనే భారత్ కు అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ఇచ్చిందని తరంజిత్ గుర్తుచేశారు.

ఇది రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య బలమైన సహకారానికి నిదర్శనమన్నారు.భారత్, అమెరికాలు ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు చేస్తున్నాయని తరంజిత్ సింగ్ చెప్పారు.1990ల చివరిలో అమెరికాతో భారత్ రక్షణ వాణిజ్యం దాదాపుగా సున్నాగా వుండేదని ఆయన గుర్తుచేశారు.కానీ ఇది 2022లో 20 బిలియన్లకు పైగా చేరు కుందని.

అలాగే ఇంధన వాణిజ్యం ఐదేళ్ల క్రితం సున్నాగా వుండేదని, ఇప్పుడు 20 బిలియన్లకు చేరుకుందని సంధూ తెలిపారు.

America, Expatriate, Heartfelt, Indians, Pm Modi, Taranjitsingh-Telugu NRI

ఎన్ఐడీ ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రన్ సత్నామ్ సింగ్ సంధూ మాట్లాడుతూ… భారత్ మళ్లీ ‘విశ్వగురువు’ అవ్వాలనే లక్ష్యంలో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకమైందన్నారు.ఏ దేశ పర్యటనకు వెళ్లినా .అక్కడి భారతీయ కమ్యూనిటీని కలవడానికి, వారితో మాట్లాడటానికి, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోడీ సమయాన్ని వెచ్చిస్తారని సత్నామ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ‘Heartfelt-The Legacy Of Faith’ , ‘Modi@20: Dreams Meet Delivery‘ అనే పుస్తకాలను తరంజిత్ విడుదల చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube