పవన్ కళ్యాణ్ ఒక్కరోజు సంపాదన ఎంత తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం?

పవన్ కళ్యాణ్ ఒక్కరోజు సంపాదన ఎంత తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు.

 Pawan Kalyan Solid Remuneration For Upcoming Project Only For 30 Days Schedule ,-TeluguStop.com

పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తే చాలు ఆ సినిమాకు కేవలం పవన్ కళ్యాణ్ నుంచి భారీ స్థాయిలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు సినిమా విడుదలకు రెండు మూడు ముందు నుంచి హంగామా మొదలవుతుంది.

ఎలాంటి సినిమాల్లో చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే పవన్ నటించిన సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఒకే తరహాలో మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు.

అదేవిధంగా పారితోషికం విషయంలో కూడా మిగతా హీరోలను చాలా ఈజీగానే డామినేట్ చేస్తూ వస్తున్నాడు.ఇకపోతే సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఒక హీరో రెండు మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి అంటే తర్వాత వచ్చే సినిమా పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది.

అంతే కాకుండా హీరో పారితోషికం కూడా తగ్గుతుంది.

Hariharaveera, Pawan Kalyan, Solid, Tollywood, Top List-Movie

కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హిట్ అయినా పవన్ క్రేజ్ కొంచెం కూడా తగ్గదు.ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను పూర్తిచేసే పనిలో బాగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకుంటున్నాడట.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇటీవల త్రివిక్రమ్ సలహా మేరకు మరొక తమిళ రీమేక్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో మంచి విజయం అందుకున్న వినోదయ సీతం సినిమా చేసేందుకు పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి.

Hariharaveera, Pawan Kalyan, Solid, Tollywood, Top List-Movie

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించాడు అని కథనాలు వినిపించాయి.తాజాగా అందిన సమాచారం ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజుల్లోనే పాల్గొనే విధంగా షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే మొదలు కాబోతున్న ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా 60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆ ప్రకారంగా చూసుకుంటే ఒక్క రోజుకు పవన్ కళ్యాణ్ పారితోషికం ఏకంగా రెండు కోట్ల వరకు ఉంటుంది అని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube