పాత హోం స్క్రీన్‌ మెనూ ముఖం మొత్తిందా? ఈ లాంచర్లను ట్రై చేయండి, కొత్త అనుభూతి పొందండి!

పాత హోం స్క్రీన్‌ మెనూ ముఖం మొత్తిందా? ఈ లాంచర్లను ట్రై చేయండి, కొత్త అనుభూతి పొందండి!

మనలో చాలామందికి స్మార్ట్‌ఫోన్‌ హోం స్క్రీన్‌ మెనూ మార్చే అలవాటు ఉంటుంది.ఎందుకంటే, బై డిఫాల్ట్ వచ్చిన మెనూ చూడాలంటే ఎవరికైనా బోర్ కొడుతోంది మరి.

 Old Home Screen‌ Menu Face Total Try These Launchers , Get A New Feel, Microso-TeluguStop.com

అందుకే అప్పుడప్పుడు మనం మన స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్ మెనూని మార్చుకోవాలి.మన ఫోన్‌లో పాత ఇంటర్‌ఫేస్‌తోపాటు, యాప్స్‌, ఫోన్‌ పనితీరులో మీకు నచ్చినట్లుగా మార్పులు చేసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొన్ని లాంచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి యూజర్లకు పూర్తిస్థాయిలో కొత్త అనుభూతిని ఇవ్వగలవు.ప్లేస్టోర్‌లో ఎన్నో రకాల లాంచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిలో ది బెస్ట్ యాప్స్ వివరాలు చూద్దాము.

మనలో దాదాపు 90% ఆండ్రాయిడ్ యూజర్లే.అందులో ఎక్కువ మంది ‘నోవా లాంచర్‌’ను ఉపయోగిస్తుంటారు.ఫోన్‌ కస్టమైజేషన్‌కు బెస్ట్ లాంచర్‌గా దీన్ని చెబుతూ వుంటారు.ఇందులో ఐకాన్‌ ప్యాక్‌, డార్క్‌ మోడ్‌, థీమ్‌ చేంజ్‌, హోమ్‌ స్క్రీన్‌ కస్టమైజేషన్‌‌, విడ్జెట్స్‌ వంటివి సులువుగా చేయొచ్చు.

దీంతో మనకు నచ్చినట్లుగా ఫోన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.ఇంకొంతమంది రేషియో లాంచర్ ని వినియోగిస్తుంటారు.దీని గొప్పతనం ఏమంటే థీమ్ మొత్తం గ్రే అండ్ బ్లాక్ కలర్ ని కలిగి ఉంటుంది.ఇందులో ఉచిత వెర్షన్ తో పాటుగా సుబ్స్క్రిప్షన్ వెర్షన్ కూడా ఉంటుంది.

ఇది పూర్తిగా యాడ్‌-ఫ్రీ లాంచర్‌.

ఇంకొంతమంది మైక్రోసాఫ్ట్ లాంచర్‌ ని వినియోగిస్తారు.

గతంలో యారో లాంచర్‌ గా పాపులర్‌ అయిన దానినే ఇపుడు మైక్రోసాఫ్ట్ లాంచర్‌ అని పిలుస్తున్నారు.దీనిలో లాండ్‌స్కేప్‌ మోడ్‌, డార్క్‌ థీమ్‌, పర్సనలైజ్డ్‌ న్యూస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇతర కంపెనీల ఫోన్లలో షావోమి, రెడ్‌మీ, పొకో ఫోన్లను ఉపయోగించిన అనుభూతి పొందాలనుకునే వారు ఈ లాంచర్‌ను ట్రై చేయొచ్చు.ఇక ఇది ఆండ్రాయిడ్ 10 ఆపై వెర్షన్‌ ఓఎస్‌తో మాత్రమే పనిచేస్తుంది.

ఇక ఇవే కాకుండా మరెన్నో లాంచర్లు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.అయితే మీరు ఎన్నుకున్నపుడు రేటింగ్ చూసి ఉన్నతమైనవి ఎంచుకుంటే సరిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube