భూమిలోంచి బయట పడ్డ నోట్ల కట్టలు.. తర్వాత ఏం జరిగిందంటే?

భూమిలోంచి బయట పడ్డ నోట్ల కట్టలు.. తర్వాత ఏం జరిగిందంటే?

డబ్బు అంటే ఎవరికి ఆశ ఉంటుంది.సంపాదనపై ప్రతి ఒక్కరికి మక్కువ ఉంటుంది.

 Old Currency Notes Found In Agriculture Land In Patna Old Currency, Old Currency-TeluguStop.com

చాలా డబ్బు సంపాదించాలని, లక్జరీగా లైఫ్ బతకాలని అందరూ కోరుకునేదే.ఏ కష్టం లేకుండా వచ్చే డబ్బంటే చాలా మందికి ప్రీతి పాత్రమే.

రోడ్డు మీద కరెన్సీ నోటు కనిపిస్తే.ఎవరూ చూడకముందు లటుక్కున జేబులో వేసేసుకుంటారు.

చిన్నదా, పెద్దదా అనేది ఏమాత్రం విషయం కాదు.పది రూపాయల నోటు నుండి 2 వేల రూపాయల నోటు వరకు ఏది కనిపించిన అసలు ఆగే ప్రసక్తే లేదు.

అలాంటి ఘటనే బిహార్ పట్నాలో జరిగింది.పసౌడా అనే గ్రామంలో ఓ రైతు తన పొలాన్ని దున్నిస్తున్నాడు.

పొలం దున్నుతున్న క్రమంలో ఆ ట్రాక్టర్ డ్రైవర్ కు నోట్ల కట్టలున్న మూట పొలంలో దొరికింది.ఆ భూమి యజమాని ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

తన పొలంలో నోట్ల కట్టలున్న మూట దొరకడం తనను ఉబ్బితబ్బిబ్బు చేసింది.ఈ విషయం కాస్త వెను వెంటనే గ్రామమంతా పాకింది.

సదరు రైతు పొలంలో నోట్ల కట్టలు దొరికాయని తెలుసుకుని పొలం వద్దకు ఎగబడ్డారు.అయితే ఆ నోట్ల కట్టలో ఉన్నవి పూర్తిగా పాత నోట్లు.

కానీ అవేవీ పట్టించుకోలేదు గ్రామస్థులు.చేతికి దొరికినంత, అందినకాడికి ఆ నోట్లను తీసుకున్నారు.

పొలంలో నోట్ల కట్టలు దొరికాయన్న విషయం కాస్త పోలీసులకు చేరింది.ఇదేంటో తెలుసుకుందామని వారు అక్కడికి చేరేలోపే నోట్ల కట్టలతో గ్రామస్థులు పరారయ్యారు.

పొలం వద్ద మిగిలిన కొన్ని నోట్లను స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రూ.500, రూ.1000 నోట్ల కట్టలతో ఉన్న మూట అక్కడికి ఎలా వచ్చింది? ఎవరివి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube