హైదరాబాద్ లోనే చెక్ షూటింగ్ ముగించబోతున్న నితిన్  

Nithin latest film Check resumes shooting in Hyderabad, Tollywood, Telugu Cinema, Rakul Preet Singh, Priya Prakash Worrier - Telugu @actor_nithiin, Check Movie, Hyderabad, Nithin, Priya Prakash Worrier, Rakul Preet Singh, Telugu Cinema, Tollywood

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నాడు.ఒకదాని తర్వాత ఒక సినిమా కంప్లీట్ చేసే పని మీద ఉన్నాడు.

TeluguStop.com - Nithin Latest Film Check Resumes Shooting In Hyderabad

ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న రంగ్ దే సినిమాకి గుమ్మడికాయ కొట్టేశారు.ఇక ప్రస్తుతం చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్ మూవీ కూడా ముగింపు దశకి చేరుకుంది.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరల రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో కనిపిస్తుంది.

TeluguStop.com - హైదరాబాద్ లోనే చెక్ షూటింగ్ ముగించబోతున్న నితిన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా చేస్తుంది.ఇదిలా ఉంటే చెక్ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతుంది. ఈ నెల 10న దర్శకుడు చంద్రశేఖర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.

ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ పరిసరాలలో కొనసాగుతుంది.రకుల్ ప్రీత్ సింగ్, సంపత్ రాజ్, హీరో నితిన్ పాల్గొంటున్న కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాతలు సినిమాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.చదరంగం నేపథ్యంలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథతో చిత్రం రూపొందుతోంది.

నటుడిగా నితిన్‌ స్థాయిని పెంచే చిత్రమిది. చంద్రశేఖర్‌ యేలేటి చాలా విభిన్నంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నితిన్‌, రకుల్‌, సాయి చంద్‌, సంపత్‌ రాజ్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌ నవంబర్‌ 5వ తేదీ వరకూ కొనసాగుతుంది.

దీంతో చిత్రీకరణ పూర్తవుతుందన్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే నితిన్ అంధాదున్ రీమేక్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే దానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.

#Hyderabad #Nithin #@actor_nithiin #PriyaPrakash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube