విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌పై ట్రోల్స్‌... బ్రదర్‌ ఇలా అయితే కష్టం

విజయ్‌ దేవరకొండకు ప్రస్తుతం యూత్‌లో యమ క్రేజ్‌ ఉంది.యంగ్‌ సూపర్‌ స్టార్‌ అంటూ విజయ్‌ దేవరకొండ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.

ఇలాంటి సమయంలో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ దొరసాని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.భారీ అంచనాలున్న ఆనంద్‌ దేవరకొండ దొరసాని టీజర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ అయితే వచ్చింది కాని ఆనంద్‌పై నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.ఆనంద్‌ దేవరకొండ మొహంలో గ్లో లేదని, అలాగే ఆనంద్‌ దేవరకొండ బాడీలాంగ్వేజ్‌ విజయ్‌ దేవరకొండలా మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా లేదు అంటున్నారు.

ఇక తాజాగా దొరసాని హీరోయిన్‌ శివాత్మికతో కలిసి ఆనంద్‌ చేసిన డాన్స్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వచ్చింది.ఆ డాన్స్‌కు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Advertisement

ఒక వైపు శివాత్మిక మంచి స్టెప్పులతో ఆకట్టుకుంటే ఆనంద్‌ మాత్రం ఆమెలో సగం ప్రతిభ కూడా చూపించలేదు.సినిమాలో కూడా ఇలాగే ఉంటే కష్టమే అంటున్నారు.

శివాత్మిక డామినేషన్‌ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంటున్నారు.ఇక ఉన్న పాత్రకు కూడా ఆనంద్‌ న్యాయం చేయలేక పోతే మాత్రం అన్నకు చెడ్డ పేరు తీసుకు వచ్చిన వ్యక్తి అవుతాడు అంటూ ఆనంద్‌పై ట్రోల్స్‌ మొదలయ్యాయి.ఆనంద్‌ తన అన్నను చూసి చాలా నేర్చుకోవలని, ముఖ్యంగా ఆటిట్యూడ్‌ను కనబర్చాలి అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

మొత్తానికి ఆనంద్‌ దేవరకొండ దొరసాని చిత్రం తర్వాత ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

సంక్రాంతి సినిమాలకు షాక్ ఇస్తున్న రేవంత్ రెడ్డి......
Advertisement

తాజా వార్తలు