నవగ్రహాల చుట్టూ ఏవిధంగా ప్రదక్షిణాలు చేయాలి.. ఎన్ని సార్లు ప్రదక్షిణలు చేయాలో తెలుసా?

నవగ్రహాల చుట్టూ ఏవిధంగా ప్రదక్షిణాలు చేయాలి.. ఎన్ని సార్లు ప్రదక్షిణాలు చేయాలో తెలుసా?

ఒకప్పుడు మనకు నవగ్రహాలు కేవలం శివాలయంలో మాత్రమే దర్శనమిచ్చేవి.ప్రస్తుత కాలంలో కొత్తగా నిర్మించబడుతున్న ఆలయాలన్నింటిలో ఈ నవగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 Navagraha Pradakshina Procedure Importance Of Nagagraha In Telugu, Navagrahas, S-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ ఆలయాలను సందర్శించి భక్తులు నవగ్రహాలను కూడా పూజించడం చేస్తుంటారు.అయితే చాలామంది నవగ్రహాలను దర్శనం చేసుకోవడానికి కొద్దిగా వెనకడుగు వేస్తారు.

నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కనుక నవగ్రహాలకు తెలియని పద్ధతిలో పూజ చేయడం వల్ల శని ప్రభావం మనపై పడుతుందని భావిస్తారు.ఈ క్రమంలోనే చాలామంది నవగ్రహాలకు పూజ చేయరు.

అయితే నవగ్రహాలకు ఏ విధంగా పూజ చేయాలి? నవగ్రహాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా జాతకరిత్యా గ్రహదోషాలు ఉన్నవారు నవగ్రహాలకు పూజ చేయడం మనం చూస్తున్నాము.

ఇలా నవగ్రహాలకు ప్రదక్షిణాలు, పూజలు చేయటం వల్ల మన జాతకంలో ఏర్పడిన ఒడిదుడుకులు తగ్గిపోతాయి.ఈ క్రమంలోనే నవగ్రహాలకు పూజలు చేసి గ్రహ దోష పరిహారం పొందుతుంటారు.

అయితే నవగ్రహాలకు పూజ చేసేవారు ఏ సమయంలో పడితే ఆ సమయంలో పూజ చేయకూడదు.స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలి.చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక చేతితో నవగ్రహాలను తాకి ప్రదక్షణ చేస్తుంటారు.పొరపాటున కూడా ఈ విధంగా నవగ్రహాలను తాకి ప్రదక్షిణాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

Telugu, Telugustop-Latest News - Telugu

నవగ్రహాల ప్రదక్షిణ చేయడానికి నవగ్రహాల మండపంలోకి వెళ్లేముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుడి నుంచి కుడివైపుగా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి.ఇలా తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత బుద్ధుడి నుంచి రాహు, కేతువులను సందర్శిస్తూ మరొక రెండు ప్రదక్షిణాలు చేయాలి.ఈ విధంగా నవగ్రహాల చుట్టూ మొత్తం 11 ప్రదక్షిణాలు చేయాలి.ఈ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తూ నవగ్రహ స్తోత్రాలను పాటిస్తూ ప్రదక్షిణాలు చేయడం ఎంతో ఉత్తమం.

అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల పేర్లను స్మరిస్తూ మండపంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నవగ్రహాలకు వీపు చూపకుండా వెనక్కి నడుస్తూ బయటకు రావాలి.

Telugu, Telugustop-Latest News - Telugu

ఆలయానికి వెళ్ళిన వారు ముందుగా నవగ్రహాలను దర్శించుకుని గర్భగుడిలో ఉన్నటువంటి మూలవిరాట్ ను దర్శనం చేసుకోకూడదు.ముందుగా మూలవిరాట్ దర్శనం పూర్తిచేసుకున్న తరువాతనే నవగ్రహాల దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలి.ఇంటికి వెళ్లగానే లోపలికి ప్రవేశించకుండా చాలామంది బయటనే కాళ్లుచేతులు కడుగుతుంటారు.

ఇలా కాళ్లు చేతులు కడిగి లోపలికి వెళ్లడం వల్ల మనం చేసిన పూజ వ్యర్థమవుతుంది.కనుక కాళ్లుచేతులు కడుక్కోకుండా ఇంటిలోనికి ప్రవేశించడం వల్ల మనం చేసిన పూజ ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube