నాని ప్లానింగ్ దారి తప్పుతుందా.. భయపడుతున్న ఫ్యాన్స్!

నాని ప్లానింగ్ దారి తప్పుతుందా.. భయపడుతున్న ఫ్యాన్స్!

న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.అయితే గత కొంత కాలంగా ఈయన లైనప్ చుస్తే మాత్రం నాని దారి తప్పుతున్నాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలవుతుంది.

 Nani Not With Proper Planning , Dasara, Director Srikanth Odela, Keerthy Suresh-TeluguStop.com

ఎందుకంటే నాని ఒకప్పుడు వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి స్టార్ గా మారడమే కాకుండా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నాడు.

అయితే ఇటీవల కాలంలో ఈయన లైనప్ ఒక్కసారి పరిశీలిస్తే.

నాని చేసిన వి సినిమా, టక్ జగదీష్ సినిమాలు అంతగా అలరించలేదు.ఇక మధ్యలో నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో పర్వాలేదు అని పించి ఒక మోస్తరు హిట్ కొట్టాడు.

అయితే మళ్ళీ అంటే సుందరానికి సినిమాతో వచ్చి నిరాశ పరిచాడు.ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం అస్సలు రాలేదు.

ఈ సినిమాలన్నిటికీ కనీసం ఓపెనింగ్స్ కూడా భారీగా అందుకోక పోవడంతో నాని టైర్ 1 హీరోల జాబితాలో చేరడం కష్టమేమో.టైర్ 2 హీరోగానే ఉండిపోతాడేమో అని ఆయన ఫ్యాన్స్ భయపడుతున్నారు.

ఈ సినిమాలన్నీ నాని మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ రాబట్టలేక పోవడంతో ఈయన మార్కెట్ తగ్గిపోయింది అని అంటున్నారు.

మరి ఇలాంటి పరిస్థితులు రావడానికి ఈయన ప్లాన్ పర్ఫెక్ట్ గా లేకపోవడమే అని అంటున్నారు.ఈయన వరుస సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ స్టార్ డైరెక్టర్లతో పని చేయడం లేదు.

క్రేజ్ లేని డైరెక్టర్లతో లేదంటే కొత్త వాళ్లతో సినిమాలు చేస్తున్నాడు.దీంతో నాని మినిమమ్ ఓపెనింగ్స్ మాత్రమే అందుకోగలుగు తున్నాడు.

మరి నానికి స్టార్ డైరెక్టర్ తో ఒక్క సినిమా ఎంతైనా అవసరం.చూడాలి ముందు ముందు అయినా నాని పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెలుతాడో లేదో.

Dasara, Srikanth Odela, Keerthy Suresh, Nani, Nani Proper-Movie

ప్రెసెంట్ నాని శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు.గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube