నందమూరి ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్న మెగా హీరోలు.. జక్కన్న అలా చేయడంతో?

ప్రస్తుతం దేశంలోని నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దర్శకధీరుడు రాజమౌళి పేరు చెబుతున్నారు.అయితే రాజమౌళి కొన్ని విషయాలలో మరీ కమర్షియల్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో నెగిటివ్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Nandamuri Fans Angry On Star Director Rajamouli Details, Nandamuri Fans, Director Rajamouli, Junior Ntr, Senior Ntr, Megastar Fans, Chiranjeevi, Sr Ntr Shatajayanthi, Netizens, Comments, Rrr, Ram Charan-TeluguStop.com

ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టకపోవడంతో తారక్ అభిమానులు తెగ ఫీలయ్యారు.

తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని బహిరంగంగా చెప్పే రాజమౌళి ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

 నందమూరి ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్న మెగా హీరోలు.. జక్కన్న అలా చేయడంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ సమయంలో కొంతమంది రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ను విష్ చేయకపోయినా ఫోన్ లో విషెస్ చెప్పి ఉండవచ్చని భావించారు.అయితే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రాజమౌళి నుంచి ఎలాంటి పోస్ట్ రాలేదు.

రాజమౌళి ప్రవర్తనపై నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi, Rajamouli, Fans Angry, Ntr, Fans, Nandmuri Fans, Netizens, Ram Charan, Senior Ntr, Srntr-Movie

ట్విట్టర్ లో బ్రహ్మాస్త్ర సినిమాను ప్రమోట్ చేస్తున్న రాజమౌళి ఈ విధంగా ప్రవర్తించడం వల్ల భవిష్యత్తులో అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఇదే సమయంలో మెగా హీరోలు మాత్రం నందమూరి ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు.మెగా హీరోలు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేదికగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Chiranjeevi, Rajamouli, Fans Angry, Ntr, Fans, Nandmuri Fans, Netizens, Ram Charan, Senior Ntr, Srntr-Movie

రాజమౌళి తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.రాజమౌళికి భవిష్యత్తు ఇంటర్వ్యూలలో సైతం ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.రాజమౌళి ఎంత బిజీగా ఉన్నా కనీసం ట్వీట్ చేయడానికి కూడా సమయం లేదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి చిన్నచిన్న తప్పులు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube