దైవం జోలికొస్తే దవడ పగిలిపోద్ది.. అఖండలో డైలాగ్.. ఇన్ డైరెక్ట్ గా వారికి తగిలేలా?

దైవం జోలికొస్తే దవడ పగిలిపోద్ది.. అఖండలో డైలాగ్.. ఇన్ డైరెక్ట్ గా వారికి తగిలేలా?

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. డిసెంబర్ 2న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.

 Nandamuri Balakrishna Powerful Dialogues In Akhanda Movie Over Hindu Temple Atta-TeluguStop.com

సినిమా రిలీజ్ రెండు రోజులు అవుతున్నా కూడా థియేటర్ల వద్ద ఇంకా పండగ వాతావరణం కనిపిస్తోంది.ఇక అఖండ సినిమాలో బాలయ్య అభిమానులు, ప్రజలు అతడిని దేవుడిలా భావిస్తుంటారు.

బాలయ్య శివుడు గెటప్ లో తలకాయలు నరుకుతూ శివతాండవం చేస్తుండటంతో అది చూసిన అభిమానులు థియేటర్లలో ఈలలు, కేకలతో సంబరాలు చేసుకుంటున్నారు.

హౌస్ ఫుల్ కలెక్షన్లతో అఖండ విజయాన్ని అందించారు ప్రేక్షకులు.

ఇక అఖండ సినిమాలో డైలాగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇందులో డైలాగ్స్ ఆటం బాంబులు పేలుతున్నాయి.

అందులో ముఖ్యంగా హిందూ ధర్మం గురించి.హిందూ టెంపుల్స్ పరిరక్షణ గురించి వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆ డైలాగులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో టీడీపీ , వైసీపీ  విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతూ దేవాలయాలను పగలగొట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయడంలాంటివి చేస్తున్న విషయం తెలిసిందే.

Akhanda, Balakrishna, Hindu Temple, Hindutemples, Tollywood-Movie

ఇక అందులోని విగ్రహాల ప్రాముఖ్యత అని తెలియజేస్తూ గట్టిగానే చురకలు వేశారు.అఖండ సినిమాలో  కొంతమంది ఆకతాయిలు ఊరి దేవాలయం లో కూర్చుని పేకాట ఆడుతూ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.దీనితో శివుడి రూపం ఎత్తిన బాలయ్య ఎంట్రీ ఇచ్చి ఆ జులాయ్ బ్యాచ్ ని ఉతికి ఆరేస్తాడు.

Akhanda, Balakrishna, Hindu Temple, Hindutemples, Tollywood-Movie

దైవం జోలికి వస్తే దవడ పగిలిపోద్ది అంటూ. చేతిలో ఉన్న శూలాన్ని చూపించాడు బాలయ్య… ఏంటి శూలం చూపిస్తున్నావు పొడుస్తావా అని బాలయ్యకి ఎదురువెళ్ళిన వ్యక్తి అనడంతో.శీలం లేని వాడిని పొడవడానికి శూలం ఎందుకురా గాడిద అంటూ బాలయ్య డైలాగ్ ను విసురుతాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube