చైతూ థ్యాంక్యూ టీజర్ అప్‌డేట్‌ వచ్చేసింది

చైతూ థ్యాంక్యూ టీజర్ అప్‌డేట్‌ వచ్చేసింది

నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన థ్యాంక్యూ మూవీ విడుదలకు సిద్దం అవుతోంది.జులై లో విడుదల కాబోతున్న థ్యాంక్యూ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు డేట్ ను ఫిక్స్ చేశారు.ఈనెల 25న సాయంత్రం 5.04 గంటలకు టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.టీజర్ విడుదల తేదీని ప్రకటించేందుకు చిన్న ఫన్నీ వీడియోను యూనిట్ సభ్యులు షేర్ చేశారు.ఆ వీడియో లో నాగ చైతన్య చాలా సీరియస్ గా థ్యాంక్యూ సినిమాకు డబ్బింగ్‌ చెబుతూ ఉంటాడు.

 Naga Chaitanya Rashi Kanna Movie Thank You Teaser Release Date , Thankyoumovie ,-TeluguStop.com

ఆ సమయంలో ఒక కెమెరా రికార్డ్‌ అవుతూ ఉంది.ఏ ఏంటీ ఇక్కడ ఎందుకు రికార్డ్‌ చేస్తున్నారంటూ చైతూ చిరాకుగా అంటాడు.అప్పుడు టీజర్ విడుదల తేదీని ప్రకటించడం కోసం చిన్న వీడియో అన్నట్లుగా దర్శకుడు విక్రమ్‌ అంటాడు.అప్పుడు చైతూ ఆశ్చర్యపోయి మన థ్యాంక్యూ సినిమా టీజర్ నే విడుదల చేయబోతున్నామా అన్నట్లుగా ఆశ్చర్య పోయి.

నిజంగానే విడుదల చేస్తున్నామా అంటాడు.

అప్పుడు నిజంగానే అనగానే తేదీ కూడా ప్రకటించారు.

మే 25వ తారీకున సాయంత్రం అంటూ నాగ చైతన్య థ్యాంక్యూ టీజర్ విడుదల పై క్లారిటీ ఇచ్చాడు.దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఎఫ్ 3 సినిమా పనులు పూర్తి అయిన వెంటనే దిల్‌ రాజు థ్యాంక్యూ సినిమా విషయమై శ్రద్ద పెట్టే అవకాశం ఉంది.అతి త్వరలోనే థ్యాంక్యూ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అవ్వబోతున్నాయి.

హీరోయిన్ గా ఈ సినిమా లో రాశి ఖన్నా నటించిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఇప్పటికే బంగార్రాజు సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్న నాగ చైతన్య వెంటనే థ్యాంక్యూ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరో వైపు ఒక వెబ్‌ సిరీస్ ను కూడా చైతూ చేస్తున్నాడు.ఆ సినిమా లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చైతూ కనిపించబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube