డిసెంబర్‌ 10న వస్తున్న 'నయీం డైరీస్‌'

డిసెంబర్‌ 10న వస్తున్న ‘నయీం డైరీస్‌’

గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న ‘నయీం డైరీస్‌’ చిత్రం డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వశిష్ఠ సింహ లీడ్‌ రోల్‌ చేశారు.

 Naeem Diaries Movie Releasing On December 10 Details, Naeem Diaries Movie, Decem-TeluguStop.com

సీఏ వరదరాజు నిర్మాత.ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చక్కని స్పందన వచ్చింది.

ఈ సందర్భంగా నిర్మాత సీఏ వరదరాజు మాట్లాడుతూ… నయీం కథ వినగానే యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో బాగుంటుందని చేశాం.వశిష్ట సింహ నటన హైలెట్ గా ఉంటుంది.

మేము అనుకున్న దానికంటే బాగా యాక్ట్‌ చేశారు.డిసెంబర్‌ 10న సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.

దర్శకుడు దాము మాట్లాడుతూ ‘‘రాజకీయ, పోలీస్‌ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయి అన్నది ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం.నయీం ఎన్‌కౌంటర్‌ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యాయనం చేశాను.

తను అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు నేనూ విప్లవకారుడుగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నాను.ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో చూశాను.

అవన్నీ డ్రమటిక్‌గా సినిమాలో చూపించాను.నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తోంది.ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా వర్గాల నుండే కాకుండా సమాజం లో విభిన్న వర్గాల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.” అని అన్నారు.

December, Damu, Gangsternaeem, Vashishta Simha, Naeem, Ca Varadaraju, Tollywood-

యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – సురేష్‌ భార్గవ్‌, సంగీతం– అరుణ్‌ ప్రభాకర్‌, ఎడిటర్‌ – కిషోర్‌ మద్దాలి, పీఆర్వో – జి యస్ కె మీడియా, నిర్మాత సీఏ వరదరాజు, రచన దర్శకత్వం దాము బాలాజీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube