నిద్ర‌లో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా ? అయితే ఇది మీ కోసమే

సాధారణంగా మనలో చాలా మందికి నిద్రలో తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు పట్టేస్తూ ఉంటాయి.అయితే కొంతమందిలో పగటి సమయంలో కూడా ఇలా పెట్టేస్తూ ఉంటాయి.

ఈ విధంగా కాలి కండరాలు పట్టేయటానికి అనేక కారణాలు ఉన్నాయి.దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు,పెరిగే వయస్సు,పోషకాహార లోపం,వ్యాయామం చేసే సమయంలో తొడ కండ‌రాలు లేదా పిక్క‌లు పట్టేస్తూ ఉంటాయి.

ఈ సమయంలో భరించరాని నొప్పి ఉంటుంది.ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు ప‌ట్టేసిన‌ప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ ప్యాక్ ను కొంచెం సేపు ఉంచితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.కొబ్బ‌రినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెల‌ను సమాన పరిమాణంలో తీసుకోని గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేస్తే బిగుసుకుపోయిన కండ‌రాలు సాగి నొప్పి తగ్గుతుంది.

Advertisement

కొబ్బరినూనెలో కొన్ని లవంగాలు వేసి మరిగించాలి.కొంచెం చల్లారాక ఈ నూనెను నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నీరు త‌గినంతగా తాగ‌క‌పోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.ఇలా డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారిలో కూడా కాలి కండరాలు పట్టేస్తూ ఉంటాయి.

ఇటువంటి వారు తగినంతగా నీరు త్రాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.శరీరంలో సరైన మోతాదులో పొటాషియం లేకపోయినా కాలి కండరాలు పట్టేస్తూ ఉంటాయి.

అలాంటివారు పొటాషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

ఆ నటుడి భార్యకు ఫోన్ చేసి నటుడిని ఇరికించిన బాలయ్య.. బాలయ్యలో ఈ యాంగిల్ ఉందా?...
Advertisement

తాజా వార్తలు