ఇంగ్లిష్ మెడిసిన్ వద్దని నాటువైద్యాన్ని ఆశ్రయించిన MS ధోనీ.. దానికోసం ఎంత చెల్లిస్తున్నాడో తెలుసా?

ఇంగ్లిష్ మెడిసిన్ వద్దని నాటువైద్యాన్ని ఆశ్రయించిన MS ధోనీ.. దానికోసం ఎంత చెల్లిస్తున్నాడో తెలుసా?

నాటువైద్యానికి కాలం చెల్లిన ఈ రోజుల్లో సాక్షాత్తు ఇండియన్ క్రికెట్ దిగ్గజం MS ధోనీ నాటువైద్యం బాట పట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు వింటున్నది నిజమే అండి.టీమిండియాకు 3 ICC ట్రోఫీలు అందించిన జార్ఖండ్ డైనమైట్.

 Ms Dhoni Resorted To Naturopath At English Medicine-TeluguStop.com

.గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసినదే.

దీని కోసం ధోనీ ప్రపంచంలోని ఏ పెద్ద ఇంగ్లీసు చికిత్సో తీసుకోకుండా.రాంచీలోని ఓ మారుమూల గ్రామంలో నాటువైద్యం చేయించుకుంటున్నాడు అంటే, వినడానికి కాస్త విడ్డురంగానే ఉంటుంది మరి.కానీ మీరు విన్నది అక్షర సత్యం.

మాజీ కెప్టెన్ ధోనీ గత కొంతకాలంగా తన రెండు కాళ్ల మోకాలి నొప్పితో తీవ్రంగా రోదిస్తున్నాడు.

దాంతో నాటువైద్యం కోసం రాంచీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంపంగ్‌లోని స్థానిక నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖేర్వార్ వద్ద చిత్స తీసుకుంటున్నాడు.అక్కడ వనమూలికలతో చేసిన మందును తాగుతున్నాడు.

ధోనీ ఇప్పటికే నాలుగు డోసులు తీసుకున్నాడు.ఒక్కో డోస్‌కి కేవలం రూ.40 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు.మహీ శరీరంలో కాల్షియం లోపం ఉన్నందునే ఇలా జరుగుతుందని సదరు వైద్యుడు చెప్పాడట.

English, Msdhoni, Naturopathi, Latest, Pain Knees-Latest News - Telugu

ఇక ఇక్కడ నాటు వైద్యుడు వందన్ సింగ్ మాట్లాడుతూ… “చికిత్స కోసం ఎంఎస్ ధోనీ నా వద్దకు మొదటిసారి వచ్చినప్పుడు నేను గుర్తించలేకపోయా.సాధారణ వ్యక్తిలా వచ్చి తన సమస్యను చెప్పాడు.మందు ఇస్తే తిన్నాడు.డోస్‌కి 40 రూపాయలు ఇచ్చాడు. ధోనీ కారు చూసి పక్కనే ఉన్న అబ్బాయిలు పెద్దగా అరిచారు.అప్పుడు కానీ విషయం తెలియలేదు.

మోకాళ్ల నొప్పికి చికిత్స కోసం ధోనీ తల్లిదండ్రులు కూడా నా వద్దకు వచ్చారు.వారికి చాలా ఉపశమనంగా అనిపించడంతో మహీ కూడా వస్తున్నాడు.” అని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube