బిగ్ బాస్ షోకు మరో షాక్.. బ్యాన్ చెయ్యాలంటూ కేంద్ర హోంశాఖకు రాజా సింగ్ లేఖ!

Mla Raja Singh Fires On Bigg Boss Show And Anchor Ravi Elimination

బిగ్ బాస్ షో అంటే ఇష్టపడే వారి సంఖ్య ఎంత ఉందో, చీదరించుకునే వారి సంఖ్య కూడా అంతే ఉంది.ఇంకా చెప్పాలి అంటే బిగ్ బాస్ షో అంటే నచ్చని వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు.

 Mla Raja Singh Fires On Bigg Boss Show And Anchor Ravi Elimination-TeluguStop.com

బిగ్ బాస్ షో అంటే నచ్చని వాళ్ళు ముఖం మీదే బిగ్ బాస్ గురించి బూతులు తిడుతూ ఉంటారు.ఇక ప్రతి సీజన్ కూడా ప్రారంభం సమయంలో రాజకీయ నాయకులు కాస్త హడావిడి చేస్తుంటారు.

ఇప్పటికే సి.పి.ఐ నారాయణ బిగ్ బాస్ షో పై కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.

 Mla Raja Singh Fires On Bigg Boss Show And Anchor Ravi Elimination-బిగ్ బాస్ షోకు మరో షాక్.. బ్యాన్ చెయ్యాలంటూ కేంద్ర హోంశాఖకు రాజా సింగ్ లేఖ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ షో తీరు గురించి, రవి ఎలిమినేషన్ గురించి రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు.బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షో బ్యాన్ చేయాలని, అసలు షో లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, ఈ షో వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని, అలాగే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటూ నిర్వాహకులను ప్రశ్నించారు.

Telugu Anchor Ravi, Ban Bigg Boss, Bigg Boss Ban, Bigg Boss, Raja Singh, Ravi-Movie

అలాగే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి ఎలిమినేషన్ వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అంటూ అతను అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.తెలుగు బిగ్ బాస్ తో పాటుగా హిందీ బిగ్ బాస్ ను కూడా బ్యాన్ చేయాలి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని తెలిపారు.అయితే రవి ఎలిమినేషన్ విషయంలో కేవలం రాజాసింగ్ మాత్రమే కాకుండా, రవి ఫ్యాన్స్ సైతం ఇదే రకమైన భావనను ప్రకటిస్తున్నారు.

మొత్తానికి రాజాసింగ్ ఎంట్రీతో ఇంతవరకు లేని తెలంగాణ, ఆంధ్ర వాదనను తెరమీదకు తెచ్చినట్లు అయ్యింది.

#Raja Singh #Bigg Boss #Bigg Boss Ban #Anchor Ravi #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube