పవన్ ను సీఎం చేయడమే మా లక్ష్యం.. మెగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

పవన్ ను సీఎం చేయడమే మా లక్ష్యం.. మెగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ కు, మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది.మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలలో చాలా సినిమాలు సంచలన విజయాలు సొంతం చేసుకున్నాయి.

 Mega Fans Desire About Power Star Pawan Kalyan Details Here Mega Fans ,  Pawan K-TeluguStop.com

బిలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలను సైతం మెగా ఫ్యాన్స్ పలు సందర్భాల్లో హిట్ చేశారు.అయితే ఈ మధ్య కాలంలో మెగా ఫ్యాన్స్ మధ్య చీలిక వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో, పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

అభిమానులు మెగా హీరోల వారీగా విడిపోయారని తెలుస్తోంది.అయితే మెగా అభిమానులు ఇలా ఫ్యాన్స్ వారీగా చీలిపోవడం వల్ల జరుగుతున్న నష్టానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.చిరంజీవి సీఎం కాకపోయినా పవన్ అయినా సీఎం అవుతారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.2019 సంవత్సరంలో ఏపీలోని చాలా అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసినా పవన్ కు పెద్దగా అనుకూల ఫలితాలు రాలేదు.రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయగా ఈ రెండు స్థానాలలో నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయి.అయితే మెగా అభిమానులు తాజాగా సమావేశమై పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.ఇతర పార్టీల పొత్తులతో పని లేకుండా జనసేన బలపడేలా అడుగులు వేయాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.2019 సంవత్సరంలో జనసేన పార్టీకి 7 శాతం ఓట్లు వచ్చాయి.

Ap Poltics, Chiranjeevi, Desire, Janseena, Fans, Pawan Kalyan-Political

పవన్ ను సీఎంగా చూడాలనే మెగా అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వనని పవన్ కామెంట్లు చేయగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ సీఎం కావాలని జనసైనికులు ఆకాంక్షిస్తున్నారు.పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడితే మంచిదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.2024 ఎన్నికల ఫలితాలను బట్టి పవన్ రాజకీయాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube