మహేష్‌ బాబు, రాజమౌళి మూవీ ఆ వార్తలన్నీ కూడా పుకార్లే

మహేష్‌ బాబు, రాజమౌళి మూవీ ఆ వార్తలన్నీ కూడా పుకార్లే

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి రెండు పార్ట్ లు మరియు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లతో అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపును దక్కించుకున్నాడు.ఇండియాస్ నెం.1 డైరెక్టర్‌ రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు.టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తదుపరి సినిమా ఏంటో అందరికి తెల్సిందే.

 Mahesh Babu Rajamouli Film Interesting , Flim News, Mahesh Babu , News In Telugu-TeluguStop.com

రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా కోసం రెడీ అయ్యాడు.ఆర్‌ ఆర్‌ ఆర్‌ హ్యాంగోవర్‌ నుండి బయట పడుతున్న రాజమౌళి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తండ్రి తో కలిసి కథ ను రెడీ చేస్తున్నాడు.

కథ వర్క్ జరుగుతుంది అనేది మాత్రమే నిజమైన వార్త.సినిమా గురించి ఈమద్య కాలంలో వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే.

Mahesh Babu, Telugu, Rajamouli, Rrr-Movie

ఖచ్చితంగా సినిమా గురించి రాజమౌళి కాని నిర్మాత అధికారికంగా ప్రకటించే వరకు అన్ని విషయాలు పుకార్లే అంటూ నెటిజన్స్‌ కు జక్కన్న టీమ్‌ మెంబర్స్ క్లారిటీ ఇచ్చారు.అసలు ఇప్పటి వరకు మహేష్ బాబు కు ఒక పూర్తి స్క్రిప్ట్‌ ను మహేష్ బాబు కాని విజయేంద్ర ప్రసాద్‌ కాని వినిపించలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.వీరిద్దరి మద్య కలయిక జరిగిన రోజు ఖచ్చితంగా మహేష్ బాబు ఒక పోటో ను షేర్‌ చేస్తాడు.ఆ రోజు కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.బాహుబలి వంటి కథ కాకుండా ఆర్‌ ఆర్‌ ఆర్‌ వంటి కథ కాకుండా పూర్తి విభిన్నమైన కథ లో మహేష్ బాబు ను రాజమౌళి చూపించబోతున్నాడు.ఒక అద్బుతం ను ఆవిష్కరించడం కోసం రాజమౌళి ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ చేస్తున్నాడు.త్వరలోనే సినిమా ఖచ్చితంగా మరో లెవల్‌ అన్నట్లుగా ఉండేలా అనౌన్స్ మెంట్‌ వస్తుంది.2024 లో సినిమా ను విడుదల చేయడం లక్ష్యం గా రాజమౌళి వర్క్‌ చేస్తున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube