సితార కింద పడిపోయింది.. ఆ తర్వాత జరిగింది ఇదే: మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట.

 Mahesh Babu About Sitara Chit Chat Youtubers Mahesh Babu, Sitara, Sarkaru Vaari Paata Movie, Chit Chat, Keerthy Suresh, Tollywood, Parasuram-TeluguStop.com

సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా మహేష్ బాబు అలాగే చిత్రబృందం ప్రస్తుతం సక్సెస్ మీట్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా మహేష్ బాబు పలువురు యూట్యూబర్లతో చిట్చాట్ నిర్వహించారు.ఈ చిట్ చాట్ లో భాగంగా ఆ కార్యక్రమానికి హీరో మహేష్ బాబు కీర్తి సురేష్ దర్శకుడు పరుశురాం హాజరయ్యారు.

 సితార కింద పడిపోయింది.. ఆ తర్వాత జరిగింది ఇదే: మహేష్ బాబు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే యూట్యూబర్ లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నాడు మహేష్ బాబు.సినిమాలోని ఒక సన్నివేశంలో హీరోయిన్ కీర్తిసురేష్ నన్ను తిట్టాలి.కానీ అప్పుడు మూడు టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయిందట.

అప్పుడు డైరెక్టర్ కీర్తి సురేష్ దగ్గరికి వెళ్లి మేడం మీరు సార్ ని తిట్టాలి గుర్తుపెట్టుకోండి ఆయనను మీరు తిట్టాలి అని చాలాసార్లు చెప్పినప్పటికీ కీర్తి సురేష్ మహేష్ బాబు ను తినడానికి ఇబ్బంది పడుతుందట.

అయితే అప్పుడు కీర్తిసురేష్ ఇబ్బంది పడుతుంది అన్న విషయం మహేష్ బాబు కి అర్థం అయ్యి పర్వాలేదు కీర్తి నువ్వు నన్ను తిట్టు అని చెప్పడంతో.అప్పుడు కీర్తి సురేష్ సార్ నేను మిమ్మల్ని తిట్టలేను ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ అభిమానులు ఏదో ఒకటి నన్ను అంటారు అని చెప్పిందట.అప్పుడు మహేష్ బాబు ఏమీ అనరు అమ్మా నువ్వు నన్ను తిట్టు అని నచ్చజెప్పి ఆ సన్నివేశాన్ని పూర్తి అయ్యేలా చేశాము అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.

అయితే సర్కారు వారి పాట సినిమాను మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఆ సీన్‌ ను చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్‌ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు.తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది అని చెప్పుకొచ్చాడు మహేశ్‌బాబు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube