తెలుగుతెరపై హిట్టయినా లేడీ ఒరియేంటెడ్ చిత్రాలు.. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు?

తెలుగుతెరపై హిట్టయినా లేడీ ఒరియేంటెడ్ చిత్రాలు.. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే తెరకెక్కేవి.ఈ విధంగా కమర్షియల్ చిత్రాలలో హీరో హీరోయిన్లకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం సర్వసాధారణం.

 Lady Oriented Movies Hit On Tollywood From Then To Till Today Details,  Lady Ori-TeluguStop.com

అయితే ఆ సినిమాలో హీరోయిన్ ఎంత నటించిన ఆ సినిమా విజయవంతం అయిన తర్వాత ఆ క్రెడిట్ మొత్తం హీరో దర్శకుడికి మాత్రమే వెళ్తుంది కానీ హీరోయిన్ ను పెద్దగా పట్టించుకునేవారు కాదు.ఈ క్రమంలోనే హీరోయిన్లు కూడా హీరోలకు తక్కువ కాదంటూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టించారు.

ఈ విధంగా తెలుగుతెరపై ఎన్నో అద్భుతమైన లేడి ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడ్డాయని చెప్పవచ్చు.మరి ఆ లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

మిస్సమ్మ:

1995 లో సావిత్రి ప్రధాన పాత్రలో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎంతటి గుర్తింపు సంపాదించుకుందో అందరికి తెలిసిందే.ఇందులో సావిత్రి నటనకు ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.ఇలా మిస్సమ్మ సినిమా విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

అంతులేని కథ:

Anthuleni Katha, Anushka, Arundhati, Jayaprada, Lady, Mayuri, Missammma, Patigha

జయప్రద ప్రధాన పాత్రలో 1976లో కె.బాలచందర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతోమంది మహిళామణులకు స్ఫూర్తిగా నిలబడింది.చుట్టూ కామంతో కళ్లు మూసుకుపోయిన మగాళ్ళ మధ్య ఒక మహిళ ఎంతో ధైర్యంతో ఉద్యోగం చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకులు.ఈ సినిమా చూసిన ఎంతో మంది మహిళలు వారి ఆలోచనా విధానాలను కూడా మార్చుకున్నారు అంటే ఈ సినిమా ప్రభావం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మయూరి:

Anthuleni Katha, Anushka, Arundhati, Jayaprada, Lady, Mayuri, Missammma, Patigha

నమ్మించి తనతో కలిసి జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పిన ప్రియుడు తనకు అంగవైకల్యం కలిగితే నడిరోడ్డున ఆ మహిళను వదిలి వెళితే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చూపించారు.ఇక ఇందులో ఏ మాత్రం నిరాశ కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో జైపూర్ ఫుట్ ద్వారా నాట్యంలో తన ప్రతిభను కనబరిచి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన నటి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడింది.

ప్రతిఘటన:

Anthuleni Katha, Anushka, Arundhati, Jayaprada, Lady, Mayuri, Missammma, Patigha

విజయశాంతి ప్రధాన పాత్రలో 1985లో తెరకెక్కిన చిత్రం ప్రతిఘటన.ఇందులో విజయశాంతి నటనకు అందరూ ప్రశంసలు కురిపించారు.అన్యాయాన్ని ఎదిరించిన పాపానికి నలుగురిలో ఆమెను నగ్నంగా అవమానించిన ఘటన అందరి హృదయాలను కలచివేసింది.దీంతో ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా రాక్షస సంహారం కోసం విజయశాంతి నడుంబిగించి వారిపై పోరాటం చేసిన తీరు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాతో పాటు ఈమె నటించిన ఒసేయ్ రాములమ్మ, కర్తవ్యం వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అరుంధతి:

Anthuleni Katha, Anushka, Arundhati, Jayaprada, Lady, Mayuri, Missammma, Patigha

గ్లామరస్ పాత్రలో నటిస్తున్నటువంటి అనుష్క ఇలా అత్యంత భారీ బడ్జెట్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి అంగీకరించడంతో అప్పట్లో ఈమె గురించి ఎన్నో కామెంట్లు వినిపించాయి.అయితే వాటన్నింటినీ పక్కనపెట్టి ఎంతో ఆత్మ విశ్వాసంతో ఈ సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులను సృష్టించింది ఈ జేజమ్మ.ఇలా బాక్సాఫీస్ వద్ద ఎన్నో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube