పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ.. వధువు ఎవరంటే?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో క్రేజ్, పాపులారిటీని సాధించిన కమెడియన్లలో ఆర్పీ ఒకరనే సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోలో ఆర్పీ చేసిన స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 Kirrak Rp Lakshmi Prasanna Jabardast Comedian Engagement Photos Viral , Jabardast Comedian, Kirrak Rp, Lakshmi Prasanna, Hyderabad, Jabardast, Engagement Photos-TeluguStop.com

అయితే నాగబాబు జబర్దస్త్ షోకు దూరమైన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆర్పీ కూడా ఈ షోకు దూరం కావడం గమనార్హం.అదిరింది షోలో కొంతకాలం స్కిట్లు చేసిన ఆర్పీ ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తున్నారు.

జబర్దస్త్, ఇతర టీవీ షోలతో పోల్చి చూస్తే రెట్టింపు రెమ్యునరేషన్ దక్కుతుండటంతో ఈ షోపై ఇతర స్టార్ కమెడియన్లు సైతం ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.ఈ ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ పెళ్లి కొడుకు అయ్యారని తెలుస్తోంది.

 పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ.. వధువు ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కిర్రాక్ ఆర్పీగా పాపులర్ అయిన ఈ కమెడియన్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆర్పీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న అని గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారని తెలుస్తోంది.

ఈ వేడుకకు పలువురు జబర్దస్త్ కమెడియన్లు, ఆర్పీ సన్నిహితులు, ఆర్పీ కుటుంబ సభ్యులు హాజరయ్యారని సమాచారం.కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న జోడీ చూడటానికి అందంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆర్పీ పెళ్లి తేదీకి సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.

హైదరాబాద్ లోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో నిన్న ఈ వివాహ వేడుక జరిగిందని తెలుస్తోంది.జబర్దస్త్ షోకు దూరమైన తర్వాత ఈ షో గురించి ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో కొంతమంది నెటిజన్లు ఆర్పీపై నెగిటివ్ కామెంట్లు చేశారు.

ఆర్పీ నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆర్పీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube