మహేష్ ను అలా అన్న సమయంలో గుండె ఆగిపోయింది.. కీర్తి కామెంట్స్ వైరల్!

సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మహేష్ బాబు, కీర్తి సురేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Keerthy Suresh Shocking Comments About Mahesh Babu Goes Viral , Keerthy Suresh , Mahesh Babu , Sarkaru Vaari Paata , Shocking Comments , Comments About Mahesh Babu-TeluguStop.com

సినిమాలోని ఒక సన్నివేశంలో కీర్తి సురేష్ మహేష్ ను బో* అంటూ తిడుతుంది.దర్శకుడు మహేష్ ను అలా తిట్టించడంపై మహేష్ బాబు అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

అయితే సినిమాలోని ఆ సీన్ కు సంబంధించి కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.మహేష్ ను అలా తిట్టే సమయంలో తన గుండె ఆగిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.

 మహేష్ ను అలా అన్న సమయంలో గుండె ఆగిపోయింది.. కీర్తి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్ ఫ్యాన్స్ తనపై సీరియస్ అవుతారని అనిపించిందని కీర్తి సురేష్ కామెంట్లు చేశారు.మహేష్ బాబు ముఖం చూసి అలా తిట్టడం తన వల్ల కాలేదని ఆమె అన్నారు.

మొదట తాను ఆ డైలాగ్ ను మెల్లగా చెప్పానని ఆమె కామెంట్లు చేశారు.

దర్శకుడు ఒప్పుకోకుండా ముఖం మీద చూపించి తిట్టాలని చెప్పారని కీర్తి సురేష్ వెల్లడించారు.

మొత్తానికి ఎలాగోలా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశానని అయితే ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ భయపడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.మహేష్ బాబు సైతం ఈ తిట్టు గురించి స్పందించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

మూడు టేకులు అయినా కీర్తి సురేష్ తనను తిట్టలేకపోయిందని మహేష్ కామెంట్లు చేశారు.

సమయంలో దుబాయ్ లో ఎండ మండిపోతుందని సన్నివేశం ఓకే కావడం లేదని మహేష్ చెప్పారు.తాను కీర్తి సురేష్ దగ్గరకు వెళ్లి తిట్టు తిట్టు అని మొరపెట్టుకున్నానని మహేష్ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కూడా తిట్టాలని గట్టిగా చెప్పడంతో కీర్తి సురేష్ తిట్టారని మహేష్ బాబు వెల్లడించారు.

మహేష్ బాబు వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube