ఎన్టీఆర్-కొరటాల సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ.. కానీ ఎప్పుడంటే?

ఎన్టీఆర్-కొరటాల సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ.. కానీ ఎప్పుడంటే?

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.ఈయన ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 Jr Ntr S Ntr30 Delayed Slightly , Jr Ntr , Koratala Siva , Ntr30 , Tollywood Ind-TeluguStop.com

ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.

ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.

కానీ మళ్ళీ ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు అంటూ మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

సినిమా స్టార్ట్ ఎప్పుడు అయినా కూడా వీరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ సినిమా రావడం ఖాయం అనే నమ్మకంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు.ఆ నమ్మకంను కాపాడు కోవాలనే ఉద్దేశంతో కొరటాల కూడా స్క్రిప్ట్ విషయంలో చాలా శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ విషయంలో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.మొన్నటి వరకు ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉంది అనే వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం వీరు షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నారట.కానీ జూన్ లో మాత్రం కాదు.

జులై లో సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు అనే వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

Jr Ntr, Jrntrs, Koratala Siva, Ntr Fans, Ntr, Tollywood-Movie

ఈ మేరకు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ప్రకటన రానుందని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా కోసం తారక్ న్యూ లుక్ లోకి మారిపోనున్నాడు.ఏకంగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 8 నుండి 9 కిలోల బరువు తగ్గనున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube