'NTR30' నుండి బిగ్ అప్డేట్.. టైం కూడా ఫిక్స్.. పోస్టర్ వైరల్!

‘NTR30’ నుండి బిగ్ అప్డేట్.. టైం కూడా ఫిక్స్.. పోస్టర్ వైరల్!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు రేపు జరుపుకోనున్నారు.ఈ క్రమంలోనే ఈయన కొత్త సినిమాల అప్డేట్ లు వరుసగా రావడానికి రెడీగా ఉన్నాయి.

 ‘ntr30’ నుండి బిగ్ అప్డేట్.. టై�-TeluguStop.com

ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.

రేపు బర్త్ డే జరుపుకుంటున్న నేపథ్యంలో NTR30 నుండి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈయన పుట్టిన రోజు అని ముందు నుండే నందమూరి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే పోస్టర్ ద్వారా బిగ్ అప్డేట్ రాబోతుంది అని తెలపడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వీరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ సినిమా రావడం ఖాయం అనే నమ్మకంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు.ఆ నమ్మకంను కాపాడు కోవాలనే ఉద్దేశంతో కొరటాల కూడా స్క్రిప్ట్ విషయంలో చాలా శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తుంది.

మరి ముందు నుండి అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా అప్డేట్ ఇవ్వడానికి కొరటాల రెడీ అయిపోయాడు.ఈ నేపథ్యంలోనే ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో తారక్ కనిపించడం లేదు.ఆయన పేస్ కనిపించకుండా వర్షంలో తడుస్తున్న కత్తిని చూపించారు. కత్తి కూడా చాలా వెరైటీగా, ట్రెండీగా ఉంది.ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ సాయంత్రం వచ్చే బిగ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.మరి కొరటాల ఈసారి తన మార్క్ చూపించి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా అనేది వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ కాలేయం రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube