ఒక్క డిజాస్టర్ పడితే.. టీమ్ మొత్తం చేంజ్.. కొరటాల భారీ మార్పులు!

ఒక్క డిజాస్టర్ పడితే.. టీమ్ మొత్తం చేంజ్.. కొరటాల భారీ మార్పులు!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.

 Jr Ntr Koratala Siva Team Up For Their Second Film Together, Jr Ntr, Koratala Si-TeluguStop.com

ఈయన సామజిక అంశాలను ప్రధానంగా తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కిస్తూ ఉంటాడు.ఈయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా ఎదుర్కోకుండా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చాడు.

కానీ మొదటిసారి ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు.చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అని అంతా అనుకున్నారు.

కానీ భారీ ప్లాప్ మూటగట్టుకున్నాడు.అసలు ఇది కొరటాల తీసిన సినిమానేనా అని అంతా ఆశ్చర్య పోయారు.

ఒక్క ప్లాప్ తో ఎప్పుడు లేనంత నెగిటివిటీ వచ్చింది.అయితే ఈ విషయాన్నీ పక్కన పెట్టి కొరటాల నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది.

కొరటాల ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడని అందరికి తెలుసు.మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ కూడా వదిలి ఈ కాంబో ఫిక్స్ అయినట్టు కన్ఫర్మ్ చేసారు.

అయితే ఇదే సందర్భంగా మోషన్ పోస్టర్ లో కొరటాల తన టెక్నీకల్ టీమ్ ని కూడా ప్రకటించాడు.

Acharya, Chiranjeevi, Jr Ntr, Jrntr, Koratala Siva, Ntr, Ram Charan-Movie

ఇందులో ప్రకటించిన దాని ప్రకారం కొరటాల టీమ్ మొత్తాన్ని మార్చేశాడు.ఇందులో సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ ను తన ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాడు.అయితే ఇందులో ఎడిటర్ శ్రీకర్ మినహా కొరటాల టీమ్ మొత్తం చేంజ్ చేసాడు.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమాలకు ఇప్పటి వరకు ఉన్న టీమ్ అంతా చేంజ్ చేస్తేనే తెలుస్తుంది ఈయన ఎన్టీఆర్ 30 సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube