గన్నవరం లో గరం గరం పాలిటిక్స్ ? జగన్ సీరియస్ ?

  గన్నవరం వైసిపిలో ప్రస్తుతం గరంగరం పాలిటిక్స్ జరుగుతున్నాయి.ముఖ్యంగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ,  ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అనుబంధ సభ్యుడి గా కొనసాగుతున్నారు.

 Jagan Serious On Gannavaram Constency Group Politics Issue Gannavaram, Dutta Ramachandrarao, Ap Cm , Jagan, Ysrcp, Ap, Gannavaram Politics,jagan Serious,cmo,-TeluguStop.com

పార్టీలో చేరకపోయినా,   నాయకుడుగా చెలామణి అవుతున్నారు .అయితే ఆయన టీడీపీలో ఉండగా వైసీపీ లో ఆయనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇప్పటికీ ఆయన విషయంలో ఆగ్రహంతో ఉన్నారు.వంశీ ని కలుపుకుని వెళ్ళాలి అంటూ వైసీపీ నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తున్నా… నియోజకవర్గంలో మాత్రం ఆయనను కలుపుకుని వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు అంత ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాలతో తరచూ గా ఈ నియోజకవర్గంలో వివాదాలు చెలరేగుతున్నాయి ఉన్నాయి .2019 ఎన్నికల్లో టిడిపి నుంచి వంశీ పోటీ చేయగా,  ఆయనకు ప్రత్యర్థిగా యార్ల గడ్డ వెంకట్రావు పోటీ చేశారు.
     ఇప్పటికీ వంశీ కి యార్లగడ్డ కు మధ్య అంతర్గతంగా వివాదం కొనసాగుతూనే ఉంది.ఇది ఇలా ఉంటే మరోవైపు వల్లభనేని వంశీ కి వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావుకు మధ్య వివాదాలు నడుస్తున్నాయి.

ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించేందుకు రెండు వర్గాలు ప్రయత్నిస్తూ ఉండటం తో… ఈ అసంతృప్త స్వరాలకు చెక్ పెట్టే విధంగా మరో వర్గం ప్రయత్నాలు చేస్తోంది.తాజాగా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

 గన్నవరం లో గరం గరం పాలిటిక్స్ జగన్ సీరియస్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో వల్లభనేని వంశీ కి 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే .తాము ఓడించి తీరుతామని దుట్టా రామచంద్ర రావు వర్గం వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి లేఖల ద్వారా తమ అసంతృప్తిని తెలియజేశారు.దీంతో దుట్టా వంశీ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చాలాకాలంగా వైసీపీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు.
 

Ap Cm, Gannavaram, Jagan, Ysrcp-Politics

  ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాలపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం.దీనిలో భాగంగానే ఈరోజు సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి రావాలని సీఎంవో నుంచి ఇరువురు నేతలకు పిలుపు వచ్చింది.గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న గ్రూపు రాజకీయాలను చక్కదిద్దకపోతే 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మళ్లీ ఓటమి తప్పదనే భావంతో ఉన్న జగన్ ఈరోజు ఇరువురు నేతలను కూర్చోబెట్టి రాజీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube