జగన్ మోహన్ రెడ్డి.. అప్పుడలా.. ఇప్పుడిలా..  

Jagan Mohan Reddy.. then.. now.. Ap, Jagan Mohan Reddy, Ap Water Flod Peoples, Heavy Rains, 500 Rs Help For Flood Peoples - Telugu 500 Rs Help For Flood Peoples, Ap, Ap Water Flod Peoples, Heavy Rains, Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా వాయుగుండాలు, తుఫానులు, వరదలు ప్రజల బతుకులను ముంచెత్తుతున్నాయి.రైతులు.

TeluguStop.com - Jagan Mohan Reddy Then Now

పంటలను, పాడి సంపదను కోల్పోయారు.ఇళ్లన్నీ వరద నీటిలో మునిగి నిత్యావసరాలను కోల్పోయి దీనావస్థలో ఉన్నారు.

ఇంత జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద పీడిత ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు,ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చేందుకు ఇప్పటిదాకా పర్యటించక పోవడాన్ని కొందరు తప్పు పడుతున్నారు.

TeluguStop.com - జగన్ మోహన్ రెడ్డి.. అప్పుడలా.. ఇప్పుడిలా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వరదల సమయంలో బాధిత ప్రదేశాలను పర్యటించిన సందర్భంలో అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ప్రతి ఇంటికి కనీసం నాలుగైదు వేల రూపాయలు ఇవ్వకపోతే ఈ పరిస్థితిలో వాళ్ళు ఎలా బ్రతక గలుగుతారు? గ్రామాలు.గ్రామాలు మునిగిపోయిన కూడా ఒక్క అధికారి కూడా వాళ్లను కలవలేదు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.కానీ.ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే ఇప్పుడే.

వరద పీడిత ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నష్టపోయారు.ఆయన ఆనాడు వ్యక్తం చేసిన ఆవేదన ను ఆచరణలోకి తెచ్చే అవకాశమూ ముఖ్యమంత్రికి లేకపోలేదు.

కానీ.ఇప్పుడు ముఖ్యమంత్రి వరద బాధితులకు ఒక్కొక్కరికి కేవలం 500 రూపాయలు మాత్రమే.

తక్షణ సాయంగా ప్రకటించడం ఎంతవరకు సమంజసం అన్నారు.వరద ప్రాంత బాధితులు, వరద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత, బాధితులు తమ తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి ఈ డబ్బులు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలియజేశారు.

ఆ వెంటనే అధికారులు ‘రాష్ట్ర విపత్తు స్పందన నిబంధనల’ మేరకు ఈ సొమ్ము ఇస్తున్నట్లు జీవో విడుదల చేశారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన డిమాండ్, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చేస్తున్న సాయానికి ఎందుకు పొంతన లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

#500Rs #Heavy Rains #ApWater

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube