వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తున్నారా  లేదా ?  క్లారిటీ వచ్చేసింది  

ఏపీ అధికార పార్టీ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు హోదాలో ఉన్న వైఎస్ విజయమ్మ పై రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి జగన్ తో  ఆమెకు విభేదాలు ఉన్నాయని, అందుకే వైసిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, అలాగే  వైఎస్ షర్మిల స్థాపించిన వైస్సార్ తెలంగాణ పార్టీలో విజయమ్మ యాక్టివ్ గా ఉంటున్నారని,  పార్టీ తరపున నిర్వహించే నిరసన కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొంటున్నారని త్వరలోనే వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయబోతున్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.

      ఈ నేపథ్యంలోని వైసిపి రాష్ట్రస్థాయి ప్లీనరీ జరగబోతూ ఉండడం తో విజయమ్మ హాజరవుతారా లేదా అని విషయంలో ఇప్పటి వరకు అనేక సందేహాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా దీనిపై ఒక క్లారిటీ వచ్చేసింది.ఈనెల 8, 9 నిర్వహించే మూడో ప్లీనరీకి గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ వైసిపి గౌరవ అధ్యక్షురాలి హోదాలో హాజరు కాబొతూ ఉండడం తో పాటు,  ఆ సభలో ఆమె ప్రసంగం చేయనున్నారు.దీంతో జగన్ కుటుంబంలో విభేదాలు తలెత్తయన్న ప్రచారంలో వాస్తవం లేదని విషయం క్లారిటీ వచ్చిందని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 

   విజయమ్మ కనుక వైసిపి ప్లీనరీకి హాజరు కాకపోతే వైసిపి రాజకీయ ప్రత్యర్థులు ఈ అంశాన్ని బాగా హైలైట్ చేసి జగన్ ఇమేజ్ ను డామేజ్ చేసి ఉండేవారని , కానీ ఇప్పుడు ఆమె ఈ సమావేశాలకు హాజరు కాబోతుండడంతో రాజకీయ ప్రత్యర్థుల  విమర్శలకు చెక్ పెట్టినట్లు అయిందని చెబుతున్నారు.విజయమ్మ రాకతో జగన్ సైతం సంతోషంలో ఉన్నట్టు గా వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.విజయమ్మ ప్రసంగంలో పార్టీ పటిస్టత తో పాటు, రాజకీయ ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే విధంగా విమర్శలు చేయించే వ్యూహంలో జగన్ ఉన్నారట.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?...

తాజా వార్తలు