సుమ క్యాష్ కార్యక్రమంలో తమన్నా కన్నీళ్లు పెట్టుకోవడానికి అసలు కారణం ఇదేనా?

బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని కొనసాగుతున్న కార్యక్రమాలలో క్యాష్ కార్యక్రమం ఒకటి.ఇక గత ఎపిసోడ్ తో ఈ కార్యక్రమం 200 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.

 Is This The Real Reason Why Tamanna Get Emotion On The Suma Cash Show , Thamann, Tollywood, Cash Show, Sonal Chauhan, Director Anil Ravipudi, Actor Sunil ,emotional, Suma Cash Show , F3 Film Team , , Tamannah Get Emotion-TeluguStop.com

ఇలా 200 ల ఎపిసోడ్ పూర్తి కావడంతో ఈ కార్యక్రమానికి ఎఫ్ 3 చిత్ర బృందం హాజరయ్యారు.ఈ క్రమంలోనే హీరోయిన్స్ సోనాల్ చౌహాన్, తమన్నా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు సునీల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా సుమ వీరి చేత ఎప్పటిలాగే ఫన్ క్రియేట్ చేశారు.వీరితో కలిసి పలు రకాల టాస్క్ లను నిర్వహించారు.అయితే గతవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చూపించారు.అయితే తమన్నాకార్యక్రమంలో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ కావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

 సుమ క్యాష్ కార్యక్రమంలో తమన్నా కన్నీళ్లు పెట్టుకోవడానికి అసలు కారణం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్యక్రమంలో భాగంగా సుమ హీరోయిన్ సోనాల్ చౌహాన్, తమన్నాతో ఒక టాస్క్ నిర్వహించారు.ఈ టాస్క్ లో భాగంగా సుమ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మహానటి సావిత్రి లాగ ఎడమ కంటి నుంచి కన్నీళ్ళు కార్చాలని సుమ చెప్పారు.ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా సుమ తమన్నాను ప్రశ్నిస్తూ.వీరిద్దరిలో మీరు డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారని ప్రశ్నిస్తూ ఆప్షన్ ఏ ఎన్టీఆర్, ఆప్షన్ బి అల్లు అర్జున్ అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెప్పలేక మహానటి సావిత్రి మాదిరిగా ఎడమ కంటి నుంచి కన్నీళ్లను కార్చారు.ఇలా తమన్నా ఏడవటాన్ని ప్రోమోలో హైలెట్ చేసి ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెంచారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube