2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 22 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఎన్టీఆర్ మూవీ ఏదో తెలుసా?

2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 22 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఎన్టీఆర్ మూవీ ఏదో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అభిమానులు ఉన్నారు.వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లు అందుకోవాలని భావిస్తారు.

 Interesting Facts About Young Tiger Ntr  Aadi Movie Details Here ,  Aadi Movie ,-TeluguStop.com

కొరటాల శివ సినిమాతో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుని రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు.తారక్ రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో హిట్లు, ఎన్నో ఫ్లాప్ లు ఉన్నాయి.

వరుస ఫ్లాప్ లు ఎదురైన సమయంలో కృంగిపోయిన ఎన్టీఆర్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించి విజయాలు అందుకునే దిశగా అడుగులు వేశారు.ఫ్లాపుల్లో ఉన్న స్టార్ డైరెక్టర్లకు చాలా సందర్భాల్లో అవకాశాలను ఇచ్చి ఆ డైరెక్టర్లకు సక్సెస్ దక్కేలా ఎన్టీఆర్ కృషి చేశారు.

కెరీర్ తొలినాళ్లలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించాయి.

అయితే వీవీ వినాయక్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది మూవీ 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 22 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

మొదట వీవీ వినాయక్ ఎన్టీఆర్ కు ప్రేమకథ చెప్పగా ఆ కథ తారక్ కు ఎంతగానో నచ్చింది.అయితే సన్నిహితుల సలహా మేరకు ఎన్టీఆర్ వీవీ వినాయక్ ను మాస్ కథ చెప్పాలని కోరారు.

తన దగ్గర మాస్ కథ లేకపోవడంతో వీవీ వినాయక్ గతంలో రాసుకున్న రెండు సీన్లను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పారు.

Aadi, Koratala Siva, Rajamouli, Vv Vinayak, Young Tiger Ntr-Movie

పిల్లవాడు బాంబులు వేసే సీన్, సుమోలు గాలిలో లేచే సీన్ ను వినాయక్ చెప్పగా ఆ సీన్లు ఎన్టీఆర్ కు ఎంతగానో నచ్చాయి.ఆ తర్వాత వినాయక్ ఆది కథ పూర్తి చేసి ఎన్టీఆర్ కు వినిపించి సినిమాను తెరకెక్కించారు.ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ కు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టిన సినిమా ఆది కావడం గమనార్హం.

ఈ సినిమా సక్సెస్ తో వినాయక్ కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube