నయనతార జాతకంలో పెళ్లి గండం అంటూ జోరుగా ప్రచారం.. కానీ?

నయనతార జాతకంలో పెళ్లి గండం అంటూ జోరుగా ప్రచారం.. కానీ?

స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో పెళ్లి గండం అంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.విఘేష్ శివన్ తో గత ఐదేళ్లుగా నయనతార ప్రేమలో ఉన్నారు.

 Interesting Facts About Star Heroine Nayanatara Marriage , Interesting Facts, Ma-TeluguStop.com

నయనతార విఘ్నేష్ శివన్ లకు ఎంగేజ్ మెంట్ కూడా పూర్తి కావడంతో వీళ్లిద్దరి పెళ్లి గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే నయనతార పెళ్లి మాత్రం అంతకంతకూ వాయిదా పడుతుండటం గమనార్హం.

ప్రస్తుతం నయనతార వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో గత కొన్నేళ్లుగా నయనతార వివాహానికి దూరంగా ఉన్నారు.అయితే కొంతమంది మాత్రం ఆమెకు పెళ్లి గండం ఉందని అందుకే వివాహం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.ఈరోజుల్లో ఇలాంటివి నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా నయనతార జీవితాన్ని పరిశీలిస్తే మాత్రం నమ్మాల్సి వస్తోంది.

మొదట నయనతార శింబుతో ప్రేమలో ఉండగా పెళ్లి జరుగుతుందనే సమయంలో వాళ్లిద్దరూ విడిపోయారు.ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న నయనతార ప్రభుదేవాకు కూడా దూరమయ్యారు.

పెళ్లి జరుగుతుందనే సమయంలో నయనతార ప్రభుదేవా విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు.పెళ్లి వరకు వస్తే విడిపోతారనే భయం నయన్ మనస్సులో ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Naynatara, Prabhudeva, Vignesh Shivan-Movie

నయనతార జాతకంలో పొలిటికల్ ఎంట్రీ కూడా ఉందని భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవుతారని జ్యోతిష్కులు చెబుతున్నారు.భవిష్యత్తులో నయనతార పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరుస్తారేమో చూడాల్సి ఉంది.నయనతార విఘ్నేష్ శివన్ త్వరగా పెళ్లి చేసుకోవాలని అభిమానులు భావిస్తుండగా అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాల్సి ఉంది.విఘ్నేష్ శివన్ కు తెలుగులో పెద్దగా పాపులారిటీ లేకపోయినా తమిళంలో విఘ్నేష్ శివన్ స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube