చిరంజీవి హీరోగా వీవీ వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఠాగూర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.తమిళంలో తెరకెక్కిన రమణ సినిమాకు రీమేక్ గా ఠాగూర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది.
తమిళంలో రమణ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించారనే సంగతి తెలిసిందే.అయితే ఠాగూర్ కు మురుగదాస్ దర్శకత్వం వహించకపోవడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయి.
మురుగదాస్ ఠాగూర్ సినిమాలో హీరో పాత్ర చాలా గొప్పదని పాటలు ఉండవని సినిమా చివర్లో పాత్ర చనిపోతుందని చెప్పారని ఆ సమయంలో సినిమాను అలా తెరకెక్కిస్తే మాత్రం నిర్మాత నష్టపోతాడని తాను చెప్పానని చిరంజీవి ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా ఠాగూర్ గురించి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత మురుగదాస్ ను ఇంద్ర సినిమా చూడమన్నానని ఆ సినిమాను చూసి మురుగదాస్ ఆశ్చర్యపోయాడని చిరంజీవి వెల్లడించారు.
ఠాగూర్ సినిమాలో హీరో పాత్రను మాత్రం చంపకుండా ఉండనని మురుగదాస్ చెప్పగా ఆ సినిమాను వినాయక్ తో చేశామని చిరంజీవి పేర్కొన్నారు.
మంచి సందేశం ఇచ్చే సినిమాలో హీరో పాత్ర చనిపోకూడదని భావించి ఈ విధంగా మార్పులు చేశామని ఆయన పేర్కొన్నారు.సైరా సినిమా హిందీ మినహా ఇతర ప్రాంతాలలో సక్సెస్ సాధించిందని చిరంజీవి తెలిపారు.గాడ్ ఫాదర్ సినిమాలో మాత్రం పాటలు లేవని ఆయన తెలిపారు.
చిరంజీవి చెప్పిన విధంగా మార్పులు చేయకుండా ఉండి ఉంటే ఠాగూర్ సినిమా ఫ్లాప్ అయ్యేదని మెగా అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఠాగూర్ సినిమా కలెక్షన్ల విషయంలో 50 డేస్, 100 డేస్ సెంటర్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.శ్రియ, జ్యోతిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.