యూకే: అభ్యంతరకర ప్రవర్తన.. భారత సంతతి పోలీస్ అధికారిపై స్కాట్‌లాండ్ యార్డ్ వేటు

యూకే: అభ్యంతరకర ప్రవర్తన.. భారత సంతతి పోలీస్ అధికారిపై స్కాట్‌లాండ్ యార్డ్ వేటు

అభ్యంతరకరమైన ప్రవర్తన కారణంగా స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న భారత సంతతి అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు.ససెక్స్ డచెస్ అయిన మేఘన్ గురించి అభ్యంతరకరమైన, వివక్షతో కూడిన ప్రవర్తన కారణంగా విధుల నుంచి తొలగించబడిన ఇద్దరిలో భారతీయ సంతతికి చెందిన అధికారి కూడా వున్నాడు.

 Indian-origin Scotland Yard Officer Dismissed For Offensive And Discriminatory B-TeluguStop.com

మెట్రోపాలిటిన్ పోలీస్ లోని ఫోరెన్సిక్ సర్వీసెస్ కు అనుబంధంగా పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ (పీసీ) సుఖ్‌దేవ్ జీవర్, పీసీ పాల్ హెఫోర్డ్ విచారణను ఎదుర్కొన్నారు.ఈ వారంలో వీరిపై నమోదైన అభియోగాలు నిజమని రుజువయ్యాయి.

2018లో ప్రిన్స్ హ్యారీతో మేఘన్ వివాహానికి కొద్దిసేపటి ముందు.తన గురించి జాత్యాహంకార వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులను ఆమె కనుగొన్నారు.

ఈ సందేశాలు 2018లో ఒక చిన్న స్థాయి అధికారుల మధ్య వాట్సాప్ లో షేర్ చేయబడినట్లు అధికారులు గుర్తించారు.దీనిపై ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కమాండర్ జోన్ సావెల్ మాట్లాడుతూ.

ఈ తరహా ప్రవర్తన ఒక పోలీస్ అధికారికి మాత్రమే కాదు, ఎవరికైనా ఆమోదయోగ్యం కాదన్నారు.మెట్ పోలీస్ విభాగంలో ఈ తరహా ప్రవర్తనను సహించేది లేదని సావెల్ స్పష్టం చేశారు.

Central Command, Rescue-Telugu NRI

డిసెంబర్ 2017 నుంచి డిసెంబర్ 2018 మధ్య సెంట్రల్ ఈస్ట్ కమాండ్ లో పనిచేస్తుండగా నిందితులు ప్రైవేట్ ఫోన్ లలోని వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ సందేశాలు షేర్ చేసుకున్నారని అధికారులు తేల్చారు.అనుచితమైన, అభ్యంతరకరమైన, వివక్షతో కూడిన సందేశాలు, మీమ్ లు, ఇతర కంటెంట్ ను మార్పిడి చేశారు.విధుల నుంచి తప్పించబడిన జీవర్, హెఫోర్డ్ లను కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ నిర్వహిస్తున్న నిషేధిత జాబితాకు జోడిస్తారు.జాబితాలోకి చేరిన పోలీసులను, సిబ్బందిని.ఇండిపెండెంట్ ఆఫీస్, ఇన్‌స్పెక్టరేట్ ఆఫ్ కాన్‌స్టాబులరీ, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ ద్వారా నియమించుకోలేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube