నా దృష్టిలో ఆ రెండు పాత్రల్లో నటించాలంటే చాలా కష్టం: కీర్తి సురేష్

నా దృష్టిలో ఆ రెండు పాత్రల్లో నటించాలంటే చాలా కష్టం: కీర్తి సురేష్

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తిసురేష్ గ్లామరస్ పాత్రలకు తావులేకుండా మంచి పాత్రలను ఎంపిక చేసుకొని వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.సాంప్రదాయానికి మారుపేరుగా కీర్తి సురేష్ కట్టుబొట్టు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

 In My View It Is Very Difficult To Act In Those Two Roles By Keerthi Suresh , Ke-TeluguStop.com

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తాజాగా మహేష్ బాబు సరసన నటించిన సినిమా సర్కారీ వారి పాట ఈనెల 12వ తేదీ విడుదలైంది.ఈ సినిమా మొదటి షోతోనే మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి రికార్డులను సృష్టిస్తోంది.

ఈ క్రమంలోనే నటి కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే మహానటి సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ కు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.మహానటి వంటి భారీ కష్టతరమైన పాత్రలో నటించిన మీకు కళావతి పాత్రల్లో నటించడం చాలా సులభతరంగా ఉంటుంది కదా అనే ప్రశ్న ఎదురవడంతో కీర్తి సురేష్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

Keerthi Suresh, Telugu, Tollywood-Movie

ఈ సందర్భంగా కీర్తి సురేష్ సమాధానం చెబుతూ మహానటి పాత్రలో ఎక్కువగా ఏడుస్తూ ఎమోషన్స్ అద్భుతంగా చూపించాల్సి వచ్చింది, కళావతి పాత్రలో కాస్త ఫన్ కూడా ఉంటుంది అయితే నవ్వించడం ఏడిపించడం రెండు కూడా ఎంతో కష్టమైన పని ఈ రెండు పాత్రలు చేయాలంటే చాలా కష్టమని కీర్తి సురేష్ వెల్లడించారు.మహానటి, కళావతి రెండు విభిన్నమైన పాత్ర లేనని రెండింటిలో చేయాలన్న పెద్ద సవాలేనని కీర్తి సురేష్ తెలియజేశారు.ఇక కళావతి డబ్బింగ్ కోసం ఎంతో కష్టపడ్డానని డైరెక్టర్ పరశురామ్ సహాయంతో ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేశానని ఈ సందర్భంగా కీర్తి సురేష్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube