ప్రదక్షిణ వల్ల లాభమేంటి.. ఎన్నిసార్లు చేయాలి  

Importance Of Pradakshina In Temple -

దేవుని దర్శనం కొరకు దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ప్రదక్షిణ చేయటం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.ప్రదక్షిణను రెండు రకాలుగా చేస్తూ ఉంటారు.

ఒకటి ఆత్మ ప్రదక్షిణ, ఇంకొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయడం.అసలు ప్రదక్షిణ చేయటం వెనక ఉన్న పరమార్థం చాలా మందికి తెలియదు.

Importance Of Pradakshina In Temple-Telugu Bhakthi-Telugu Tollywood Photo Image

సృష్టికి మూలమైన భూమి తన చుట్టూ తాను తిరగడమే కాదు, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది.

భూ భ్రమణ, పరిభ్రమణాల వల్ల దానికి శక్తి లభించిందా, ఉన్న శక్తిని నిలబెట్టుకోవడానికి ప్రదక్షిణలు చేస్తోందా అనే విషయాన్ని పక్కనబెడితే.

భ్రమణం ఆగిపోయిన మరుక్షణం ఏదైనా జరగవచ్చు.సృష్టే నిలిచిపోవచ్చు.

సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ ఫలితంగా జీవరాశి మనుగడకు శక్తి లభిస్తోంది.భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టే, ఆత్మ ప్రదక్షిణ, విగ్రహం చుట్టూ తిరగడంలోనూ ఇదే ఆంతర్యం దాగి ఉంది.

ఈ ప్రదక్షిణ వలన మనిషి ఙ్ఞానానికి అతీతమైన శక్తిని పొందటమే కాకుండా శరీరానికి,మనస్సుకు ఎంతో మేలు చేస్తుంది.ఆది శంకరాచార్యుల ప్రకారం… నిజమైన ప్రదక్షిణ ధ్యానం లాంటిది.ప్రదక్షిణలు ఎన్ని చేయాలో దాని మీద ఖచ్చితమైన నియమం ఏమి లేదు.అయితే బేసి సంఖ్యలో 3,5,7,9,11 ఇలా ప్రదిక్షణలు చేస్తూ ఉంటారు.

స్కంద పురాణం ప్రకారం ప్రదక్షిణాలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని ఉంది.అందువల్ల ఏ గుడికి వెళ్లిన తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube