ఎఫ్ 3 హిట్ అవ్వకపోతే ఇక ఎప్పుడు నటించను : రాజేంద్రప్రసాద్

ఎఫ్ 3 హిట్ అవ్వకపోతే ఇక ఎప్పుడు నటించను : రాజేంద్రప్రసాద్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3‘.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.

 I Will Not Be In Front Of You If F3 Movie Is Not A Hit , F3 Movie, Dil Raju, Ven-TeluguStop.com

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.

ఈ క్రమంలోనే నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా ఈ సినిమాకు సంబంధించిన వారంతా హాజరయ్యారు.

ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ చాలా ఆసక్తిగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.

తెలుగు సినిమాకు సంబంధించిన మూవీ మొగల్ గా రామానాయుడు గారిని పిలిచేవారు.ఆయన తర్వాత మూవీ మొగల్ గా నేను మనస్ఫూర్తిగా పిలిచేది దిల్ రాజు నే.ఒక మనిషి జీవితానికి నవ్వు ఎంత అవసరం అని చెప్పే సినిమాల్లో ఇది ఒకటి.ఈ లోకంలో ఏ స్థాయి వారికీ ఆ స్థాయి సమస్యలు ఉన్నాయి.

ఆ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం.అదే నవ్వు.

నేను 45 ఏళ్లుగా నమ్మింది దీనినే.

Dil Raju, Ani Ravipudi, Mehreen Pirzada, Rajendra Prasad, Tamannah, Varun Tej, V

ఈ సినిమాలో ప్రతి పాత్ర హైలెట్ గా ఉంటుంది.అనిల్ రావిపూడి కి హ్యాట్సాఫ్ చెప్పాలి.గుండెపై చేయి వేసుకుని చెబుతున్న.

ఈ సినిమా మాత్రం హిట్ అవ్వకపోతే నేను మళ్ళీ మీ ముందు కనిపించను.ఆ నమ్మకాన్ని మీరంతా నిలబెడతారు అని ఆశిస్తున్నా’ అంటూ రాజేంద్ర ప్రసాద్ ముగించారు.

ఇక ఈ కామెడీ సినిమాలో సునీల్, అలీ, మురళీ శర్మ, ప్రగతి వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube