నాకు డబుల్ మీనింగ్ మాటలు నచ్చవు.. చైతన్య కామెంట్స్ వైరల్!

నాకు డబుల్ మీనింగ్ మాటలు నచ్చవు.. చైతన్య కామెంట్స్ వైరల్!

అక్కినేని వారసుడు నాగచైతన్య డివోర్స్ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.విడాకుల తరువాత నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ, బంగార్రాజు, వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నారు.

 I Dont Like Words With Double Meaning Chaitanya Comments Are Viral Naga Chaitany-TeluguStop.com

ఇక ఈ సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలు వేసుకున్న నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.నాగచైతన్య రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా జూలై రెండవ తేదీ విడుదల కావడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో హీరోయిన్లకు ఒక టాస్క్ ఇచ్చారు.

ఈ టాస్క్ లో భాగంగా ప్రశ్న అడిగిన ఐదు సెకండ్లలో సమాధానం చెప్పాలి.ఈ విధంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు వీరిద్దరు సమాధానం చెప్పడానికి కాస్త తడబడ్డారు.

ఈ క్రమంలోనే ఐదు సెకండ్లలో 3 డబ్బులు మీనింగ్ డైలాగులు చెప్పమని యాంకర్ ప్రశ్నించారు.ఈ ప్రశ్న విన్న నాగచైతన్య తనుకు డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం మాట్లాడటం రాదని, ఏ విషయమైనా స్ట్రైట్ గా మాట్లాడటమే తనకు తెలుసు అంటూ సమాధానం చెప్పారు.

Avika Gore, Dialogues, Double, Malvika Nair, Naga Chaitanya, Tollywood, Vikram K

ఈ క్రమంలోనే యాంకర్ వీరిద్దరికి ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి వీరి నుంచి సమాధానాలు రాబట్టారు.ఇకపోతే ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కినట్టు తెలుస్తుంది.ఇందులో రాశి ఖన్నాతో పాటు, మాళవిక నాయర్, అవికా గోర్ కూడా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా, శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube