జబర్దస్త్ షోకు భారీగా పారితోషికం అందుకుంటున్న హైపర్ ఆది.. ఎంతంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తన నాన్ స్టాప్ పంచులతో ప్రేక్షకులను, జడ్జీలను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.

 Hyper Aadi Remuneration Hike For Jabardasth Show And Total Income Details, Hyper Aadi, Jabardasth , Remuneration, Earn Money, Hyper Aadi Remuneration, Jabardasth , Sri Devi Drama Company, Three Lakh Rupees-TeluguStop.com

జబర్దస్త్ ద్వారా ఆది పాపులారిటీని సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.హైపర్ ఆదితో పాటు ఎంతోమంది కమెడియన్లు జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు.

హైపర్ ఆది కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ,ఢీ, అలాగే ఈవెంట్లలో కూడా అందరిపై పంచులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు.

 జబర్దస్త్ షోకు భారీగా పారితోషికం అందుకుంటున్న హైపర్ ఆది.. ఎంతంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక జబర్దస్త్ షో లో అయితే జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై నాన్ స్టాప్ గా పంచులు వేస్తూ ఉంటాడు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో టెలివిజన్ రంగం సినిమా మార్కెట్ కు ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది.ఈ క్రమంలోనే చాలామంది నటీనటులు టెలివిజన్ రంగంలోనే రాణిస్తూ ఎక్కువగా సంపాదిస్తున్నారు.

మరీ ముఖ్యంగా చెప్పాలంటే జబర్దస్త్ షో ద్వారా చాలా మంది డబ్బులను భారీగానే వినకేసుకుంటున్నారు.అలా హైపర్ ఆది కూడా జబర్దస్త్ షో ద్వారా భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇటీవల టెలివిజన్ రంగంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో జబర్దస్త్ హైపర్ ఆది కూడా ఒకరిగా నిలిచాడు.జబర్దస్త్ షోని చాలామంది కేవలం హైపర్ ఆది స్కిట్ కోసమే చూస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇకపోతే గత ఏడాది కంటే ఈ ఏడాది భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న జబర్దస్త్ కమెడియన్స్ లో హైపర్ ఆది రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగినట్టుగా తెలుస్తోంది.ఏడాది వరకు హైపర్ ఆది ప్రతి ఒక్క ఎపిసోడ్ కి రెండు లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ వస్తున్నాడు.కానీ ఇప్పుడు హైపర్ ఆది రేంజ్ పెరగడంతో మరొక లక్ష రూపాయలు పెంచినట్లు తెలుస్తోంది.అంటే జబర్దస్త్ షో లో ఒక వారానికి దాదాపుగా మూడు లక్షల వరకు ఆదాయం రాబడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే కేవలం తన స్కిట్ ల కోసమే కాకుండా మిగతా కంటెస్టెంట్స్, టీమ్ లీడర్ ల కోసం మంచి మంచి స్క్రిప్ట్ లను అందిస్తూ వాటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube