నాని దసరా కోసం భారీ సెట్.. ప్రారంభమైన కొత్త షెడ్యూల్ చిత్రీకరణ?

నాని దసరా కోసం భారీ సెట్.. ప్రారంభమైన కొత్త షెడ్యూల్ చిత్రీకరణ?

నాచురల్ స్టార్ నాని మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్న చిత్రం దసరా.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని పాన్ ఇండియా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

 Huge Set For Nani Dussehra Schedule New Shooting Started , Hero Nani , Tollywood-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించి ఉండగా కొద్దిరోజులుగా షూటింగ్ కి విరామం ఇచ్చారు.

తాజాగా ఈ సినిమా ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ నేడు హైదరాబాదులో ప్రారంభమైంది.ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాదులో భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నాని ఇదివరకు ఎప్పుడు కనిపించని విధంగా రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌ లో సందడి చేయనున్నారు.అలాగే ఈ సినిమాలో నాని పూర్తిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు.

ఈ భారీ షెడ్యూల్ చిత్రీకరణలో మొత్తం ప్రధాన తారాగణం పై షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Dussehra, Nani, Keerthy Suresh, Schedule, Srikanth Odela, Telugu, Tollywood-Movi

ఈ సినిమాని గోదావరి ఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో తెరకెక్కుతోంది.ఇన్ని రోజులు నాని క్లాస్ లుక్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.అయితే మొదటిసారిగా ఇలా మాస్ లుక్ లో సందడి చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది.అయితే నాని నటించిన అంటే సుందరానికి సినిమా ప్రమోషన్, విడుదల కార్యక్రమాలలో బిజీగా ఉండటం వల్ల కొద్ది రోజులపాటు ఈ సినిమాకి విరామం ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలకు డైరెక్ట్ శ్రీకాంత్ తనదైన శైలిలో చెక్ పెట్టారు.

ఇక నేడు ఈ సినిమా షూటింగ్ యధావిధిగా పునః ప్రారంభమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube