పునీత్ రాజ్ కుమార్ కోసం ఒక్కరోజే ఏకంగా 35,000 మంది.. అసలేమైందంటే?

పునీత్ రాజ్ కుమార్ కోసం ఒక్కరోజే ఏకంగా 35,000 మంది.. అసలేమైందంటే?

చేసిన సేవా కార్యక్రమాల ద్వారా పునీత్ రాజ్ కుమార్ కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అక్టోబర్ నెల 29వ తేదీన కార్డియాక్ అరెస్ట్ వల్ల పునీత్ రాజ్ కుమార్ మృతి చెందారు.

 Huge Fans Crowd At Puneeth Rajkumar Samadhi , 35000people ,  Kantirava Stadium,-TeluguStop.com

కోట్ల సంఖ్యలో అభిమానులు పునీత్ రాజ్ కుమార్ మరణవార్త తెలిసి బాధ పడ్డారు.కన్నడ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకరైన పునీత్ మరణవార్త విని ఇతర ఇండస్ట్రీల స్టార్స్ సైతం షాకయ్యారు.

పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి అతని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ తేరుకోలేకపోతున్నారు.పునీత్ మరణం తర్వాత ఆయన ఎంత మంచి వ్యక్తి అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలిసింది.

పునీత్ పార్ఠివ దేహాన్ని చూడటానికి కంఠీరవ స్టేడియానికి లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు కావడం గమనార్హం.అంత్యక్రియల తర్వాత పునీత్ కుటుంబ సభ్యులు అభిమానుల సందర్శనకు అవకాశం ఇచ్చారు.

ఆ తర్వాత ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శిస్తున్నారు.ఆదివారం రోజున పునీత్ సమాధిని సందర్శించటానికి ఏకంగా 35,000 మంది హాజరయ్యారు.

క్యూలైన్లలో నిల్చుని మరీ పునీత్ అభిమానులు పునీత్ సమాధిని సందర్శించారు.పునీత్ చనిపోయి చాలా రోజులవుతున్నా అభిమానుల్లో పునీత్ పై అభిమానం మాత్రం అణువంతైనా తగ్గలేదు.

-Movie

పునీత్ మరణించినా ఆయన చేసినా సేవా కార్యక్రమాలను పునీత్ కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు కొనసాగిస్తున్నారు.తను చేసిన సేవా కార్యక్రమాల ద్వారా పునీత్ రాజ్ కుమార్ ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపడం గమనార్హం.పునీత్ రాజ్ కుమార్ మరణానంతరం కర్ణాటక ప్రభుత్వం పునీత్ కు కర్ణాటక రత్న అవార్డును ప్రధానం చేసింది.పునీత్ మరణం తర్వాత ఆయన అభిమానులలో చాలామంది కళ్లను దానం చేయడానికి ముందుకు వచ్చారు.

పునీత్ రాజ్ కుమార్ మరణవార్తను తట్టుకోలేక కొంతమంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube