ముఖం ఎంత జిడ్డుగా,నల్లగా ఉన్న 15 నిమిషాల్లోనే తెల్లగా మార్చే సూపర్ చిట్కా  

How To Remove Oil On Fae Permanently -

కొంత మంది ముఖం ఎంత శుభ్రం చేసుకున్న ముఖం మీద జిడ్డు అలానే ఉండిపోతుంది.ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటే ముఖం తొందరగా నల్లగా మారిపోతుంది.

బయటకు వెళ్ళినప్పుడు జిడ్డు చర్మం మీద దుమ్ము,ధూళి చేరి మరింత నల్లగా కనపడుతుంది.ముఖం మీద జిడ్డు తొలగిపోయి ముఖ చర్మం తెల్లగా,కాంతివంతంగా ఉండాలంటే ఈ చిట్కాను ట్రై చేయండి.

How To Remove Oil On Fae Permanently-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.ఈ చిట్కా ముఖం మీద నలుపును,మృతకణాలను తొలగించటంలో సహాయపడుతుంది.

ఈ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు
ముల్తానీ మట్టి లేదా పేస్ట్ – 1 స్పూన్
క్యారెట్ రసం – 1 స్పూన్
రోజ్ వాటర్ – 1 స్పూన్
నిమ్మరసం – 1 స్పూన్

ముల్తానీ మట్టి లేదా పేస్ట్
ముల్తానీ మట్టి ముఖంపై ఎక్కువగా ఉన్న నూనెను,నలుపును తగ్గిస్తుంది.

ముఖంపై జిడ్డును తొలగించి ముఖం తెల్లగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

క్యారెట్ రసం
క్యారెట్ నుండి రసాన్ని తీయాలి.

క్యారెట్ ని సన్నగా తురిమి క్యారెట్ రసం తీసుకోవాలి.క్యారెట్ లో ఉండే పోషకాలు చర్మ రంగును మెరుగుపరచి చర్మం కాంతివంతంగా,తెల్లగా చేస్తుంది.

రోజ్ వాటర్
ఇది చర్మంపై బ్యాక్టీరియాను నలుపును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది.ఇది చర్మ కంటి ఫెయిర్ గా ఉంచటంలో సహాయపడుతుంది.

నిమ్మ రసం
నిమ్మలో ఉన్న లక్షణాలు చర్మంపై ఉన్న నూనెను కంట్రోల్ చేయటంలో, జిడ్డును తొలగించటంలో బాగా సహాయపడుతుంది.ముఖంపై ఎక్కువగా జిడ్డు ఉంటే నిమ్మరసం రెండు స్పూన్లు తీసుకోవాలి.

ఈ పదార్ధాలు అన్ని బాగా కలిసేలా బాగా కలపాలి.ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి,మెడకు అప్లై చేసుకొని అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేసుకుంటూ ఉంటె మంచి ఫలితం కనపడుతుంది.ప్రతి రోజు ఇలా చేయటం కుదరని వారు వారంలో మూడు సార్లు అప్లై చేసిన మీ ముఖంపై నలుపు,మలినాలు,మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా,తెల్లగా మెరుస్తుంది.

చూసారుగా ఫ్రెండ్స్ మీ ముఖంపై జిడ్డును,నలుపును తొలగించుకోవడానికి ఈ చిట్కాను తప్పకుండా ట్రై చేయండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube