ఒత్తైన,పొడవైన జుట్టు కోసం బెస్ట్ టిప్

ప్రతి అమ్మాయి జుట్టు ఒత్తుగా అందంగా పొడవుగా ఉండాలని కోరుకుంటుంది.ఈ రోజుల్లో ఒత్తిడి,కాలుష్యం,సరైన నిద్ర లేకపోవటం వంటి కారణాలతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి మార్కెట్ లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉంటాయి.

వాటి కోసం ఎంతో డబ్బును ఖర్చు చేసేస్తూ ఉంటాం.అంతేకాకుండా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అదే సహజసిద్ధమైన పదార్ధాలను ఉపయోగిస్తే డబ్బు ఆదా అవ్వటమే కాకుండా ఎటువంటి సేడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

ఇప్పుడు ఆ చిట్కాకు కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.పచ్చి ఉల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ( బాదం నూనె) విటమిన్ E క్యాప్సిల్ 1 ఉల్లిపాయను మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఉల్లిపాయతో ఉండే సల్ఫర్ కంటెంట్ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.అలాగే తలపై చర్మం మీద రక్తప్రసరణను మెరుగుపరచి మూసుకున్న చర్మ రంద్రాలు తెరుచుకొనేలా చేస్తుంది.

ఉల్లిలో ఉండే విటమిన్ 'సి', బీటా కెరొటిన్,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉండుట వలన జుట్టుకు పోషణను ఇవ్వటమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టు డ్యామేజీని తగ్గించి జుట్టు రాలకుండా చేస్తుంది.బాదం నూనె జుట్టు సిల్కీగా ,మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.

బాదం నూనెను బ్యూటీ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారు.విటమిన్ E క్యాప్సిల్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటుంది.

విటమిన్ E క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి.తలపై చర్మంలో మృత కణాలను తొలగించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

విటమిన్ E క్యాప్సిల్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది.

పచ్చి ఉల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ఆ,ల్మండ్ ఆయిల్ ( బాదం నూనె),విటమిన్ E క్యాప్సిల్ 1- ఈ మూడు పదార్ధాలు బాగా కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఒత్తైన,పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది.

తేజ సజ్జా మిరాయ్ హిట్ అయితే స్టార్ హీరో అవుతాడా..?